Home టాప్ స్టోరీస్ సౌత్ ఇండియాలోనే ఒకేఒక్కడు బన్నీ

సౌత్ ఇండియాలోనే ఒకేఒక్కడు బన్నీ

Allu Arjun Records First Ever Record In South India

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనదైన శైలిలో తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో బన్నీ స్టైలిష్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

కాగా ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్‌కు ముందే ఈ సినిమాలోని పాటలు పలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. ముఖ్యంగా సామజవరగమనా, రాములో రాములా, బుట్టబొమ్మా వంటి పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా ఇందులో మాస్ సాంగ్‌గా ‘రాములో రాములా’ లిరికల్ సాంగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా ఈ లిరికల్ వీడియో 300 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంది.

సౌత్ ఇండస్ట్రీలోనే ఏ స్టార్ హీరోకు దక్కని ఈ ఫీట్‌ను ఒక్క అల్లు అర్జున్ మాత్రమే చేయగలగడం నిజంగా గ్రేట్ అంటున్నారు సినీ వర్గాలు. ఇలాంటి ఫీట్‌ను మళ్లీ ఇప్పట్లో ఏ హీరో కొట్టలేడని పలువురు అంటున్నారు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన నెక్ట్స్ మూవీ ‘పుష్ఫ’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad