Home సినిమా టాలీవుడ్ న్యూస్ గెస్ట్ రోల్‌కు మారిపోయిన బన్నీ.. షాక్ అవుతున్న ఫ్యాన్స్!

గెస్ట్ రోల్‌కు మారిపోయిన బన్నీ.. షాక్ అవుతున్న ఫ్యాన్స్!

Allu Arjun Guest Role In Heropanthi 2

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా అందించిన సక్సె్స్‌తో బన్నీ తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.

పుష్ప అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్నాయి. అయితే బన్నీ గతంలో నటించిన ఓ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న సినిమాలో బన్నీ గెస్ట్ రోల్‌లో నటించాల్సిందిగా సదరు చిత్ర యూనిట్ బన్నీని కోరినట్లు తెలుస్తోంది. బన్నీ నటించిన ‘పరుగు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను బాలీవుడ్‌లో టైగర్ ష్రాఫ్ హీరోగా ‘హీరోపంతీ’ అనే టైటిల్‌తో తెరకెక్కించగా, అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హీరోపంతీ 2’ అనే సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో నటించాల్సిందిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను సదరు చిత్ర యూనిట్ రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ నటించే సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుండగా, వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో బన్నీని తమ సినిమాలో కేమియో రోల్‌లో నటింపజేస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి గెస్ట్ రోల్ చేసేందుకు బన్నీ ఓకే అంటాడా లేదా అనేది చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad