Home సినిమా గాసిప్స్ ఓటిటిలో మరో నాలుగు సినిమాలు! : అయ్యో పాపం

ఓటిటిలో మరో నాలుగు సినిమాలు! : అయ్యో పాపం

ott

కరోనా ప్రళయ విజృంభణ – లాక్ డౌన్ వంటి వాటిని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇప్పటి వరకు ఎదుర్కోలేదు. హఠాత్తుగా సంభవించిన ఈ పరిణామాలు సినీ పరిశ్రమను చిన్నాభిన్నం చేశాయి. దాదాపు అన్ని సినిమాలు భారీగా నష్టపోయాయి. షూటింగులు లేక అ సినీ కార్మికులు నష్టాలను చవి చూస్తూ ఉంటే థియేటర్లు లేక ప్రొడ్యూసర్లు లబోదిబోమంటున్నారు. అయితే ఈ సమయంలో వచ్చిన ఓటిటి ఫ్లాట్ ఫామ్ ప్రొడ్యూసర్లకు ఒకింత లాభాన్ని ఎక్కువ నష్టాలను చూపిస్తుంది. వాస్తవానికి సినిమాలు నిర్మించేది డిజిటల్ ఫామ్ కోసం కాదు. ఉదాహరణకు నాని వి సినిమాను దిల్ రాజు భారీ తారాగణం – హై ఎండ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు.

వాస్తవానికి ఈ సినిమా మార్చ్ నెలలో విడుదల కానుండగా సరైన అవకాశం కోసంమూవీని పోస్ట్ పోన్ చేశారు. ఆ తరువాత లాక్ డౌన్ వచ్చి పరిస్థితి మొత్తాన్ని మార్చేసింది. ఇంత భారీ చిత్రాన్ని థియేటర్లో తప్ప ఓటిటిలో చూడడం కష్టం. నిర్మాతలు ఈ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టింది భారీ లాభాల కోసమే. కానీ ఓటిటి  తక్కువ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో పాటు మూవీ విజయం సాధించిన లాభాలు దక్కవు. ఇవన్నీ మన దర్శక నిర్మాతలకు తెలుసు అయినా థియేటర్ లో అందుబాటులో లేకపోవడంతో  ఓటిటికి సినిమాలు అప్పగించడం తప్ప మరో పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఈ దారిలో మరో టాలీవుడ్లోని నాలుగు చిత్రాలు నడుస్తునట్టు తెలుస్తుంది.

ఇప్పటికే దిల్ రాజు వి సినిమా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న విడుదల కానుందని సమాచారం. మరో వైపు రానా దగ్గుబాటి నటించిన ప్యాన్ ఇండియా సినిమా “అరణ్య” కూడా ఓటిటిలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చిన్న సినిమాలైన నిశ్శబ్దం”, “ఉప్పెన”, “సోలో బతుకే సో బెటర్” మరియు “రెడ్” చిత్రాలు ఓటిటి తప్ప మరో దారి లేదని అనుకుంటున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్  “రెడ్” కు భారీ ఆఫర్ ఉన్న నిర్మాతలు మాత్రం మొగ్గు చూపడం లేదు. కానీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి తెలియని పరిస్థితి. ఈ సమయంలో ఓటిటి తప్ప మరో అవకాశం లేదని నిర్మాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. అటు ప్రేక్షకుల కూడా వారి సినిమాలను వెండితెరమీదనే  చూడాలని అనుకుంటున్నారు.ఏదిఏమైనప్పటికీ టాలీవుడ్ చరిత్రలో ఇటువంటి సందిగ్ధమైన సంవత్సరం మరొకటి ఉండిఉండదు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad