
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో ఇటీవల రిలీజై అదిరిపోయే హిట్ అందుకుంది. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను పదేపదే చూశారు. ఇక ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నాన్-బాహుబలి రికార్డును క్రియేట్ చేసింది.
అయితే ఈ సినిమా అందుకున్న రికార్డులకు తాజాగా మరొకటి తోడయ్యింది. ఈ సినిమాను ఇటీవల జెమిని టీవీలో టెలికాస్ట్ కాగా, దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చి పడింది. ఈ సినిమా ఏకంగా 29.4 టీఆర్పీ రేటింగ్‌తో ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా ఏకంగా బాహుబలి రికార్డును కూడా అధిగమించడంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. లాక్డౌన్ సమయం కావడంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.
బన్నీ యాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్లకు థమన్ అందించిన అత్యద్భుతమైన సంగీతం తోడవ్వడంతో ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. మొత్తానికి అల వైకుంఠపురములో సినిమా వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా అదిరిపోయే రికార్డును క్రియేట్ చేయడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. అల వైకుంఠపురములో చిత్రం తన రికార్డుల వేటను ఇంకా కంటిన్యూ చేస్తుండటం నిజంగా విశేషమనే చెప్పాలి.