Home టాప్ స్టోరీస్ ఫ్యాన్ బేస్ కావాలి: పాపం నాగార్జున

ఫ్యాన్ బేస్ కావాలి: పాపం నాగార్జున

ui

ఇండస్ట్రీలో హీరో స్థాయిని నిరూపించేది అతడికి ఉన్న ఫాలోయింగ్. అందులోనూ మాస్ సినిమాలు చేసే హీరోలకు తెలుగునాట భారీ అభిమాన తారాగణం ఉంటుంది. ఆ కుటుంబం నుండి ఎంత మంది హీరోలు వచ్చిన వారి వెంట ఆ అభిమానులు కొనసాగుతారు. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. మాస్ ఫాలోయింగ్ ఉండటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో బి,సి సెంటర్ లు అధికంగా ఉన్నాయి. ఎక్కువమంది ప్రజలు ఈ కోవకు చెందిన వాళ్లే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70 శాతం మంది ప్రజలు మాస్ యాక్షన్ సినిమాలను కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలు చేయడం ద్వారా భారీగా వసూళ్లు రాబట్టవచ్చు. అందుకే మెగాస్టార్ చిరంజీవి మాస్ అభిమానులను మెప్పించేలా సినిమాలు చేస్తూ ఉంటారు.

ఇటువంటి చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. 2009 నుండి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ సినిమాలను చేయలేదు. ఆ తరువాత పదేళ్లకు ఖైదీ నెంబర్ 150 అనే సినిమాను చేశారు. వాస్తవానికి ఓ హీరోకి పదేళ్ల గ్యాప్ అన్నది చాలా పెద్ద విషయం. అయినా మెగాస్టార్ క్రేజ్ తగ్గలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను నెలకొల్పి౦ ది. దీనంతటికీ కారణం మాస్ ఫాలోయింగ్. అందుకే అక్కినేని నాగార్జున తన కొడుకు అఖిల్ కు మాస్ ఫాలోయింగ్ అందించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నపటికీ అక్కినేని కుటుంబానికి మాత్రం మాస్ ఫాలోయింగ్ రావడం లేదు.

మొదట్లో నాగచైతన్య ప్రయత్నించినప్పటికీ ఆ తర్వాత లవర్ బాయ్ గానే మారిపోయాడు. ఇక అక్కినేని అఖిల్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేని ఈ హీరో ఎలా అయినా సరే మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడు. మెగా హీరోలకు వచ్చే భారీ ఓపెనింగ్స్ కూడా వీరికి రాకపోవడంతో అక్కినేని హీరోలు ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad