ప్రపంచంలో ఎవ్వరు సాధించలేని రికార్డు నాగార్జున మాత్రమే సొంతం చేసుకున్నారు. సినీ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ హీరో కైవసం చేసుకోలేనిది మన్మథుడు కైవసం చేసుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు హీరోయిన్స్ తండ్రి పక్కన, తనయుడి పక్కన నటించిన రోజులున్నాయి. ఉదాహరణ పరంగా చూస్తే .. జయసుధ, రతి అగ్ని హోత్రి , రాధలు అటు ఎన్టీఆర్ పక్కన , తరువాత బాలకృష్ణ సరసన నటించారు. మరో వైపుగా శ్రీదేవి, రాధ అక్కినేని నాగేశ్వర రావు, కొడుకైన నాగార్జున పక్కన నటించారు.
అసలు విషయానికొస్తే ..కింగ్ నాగార్జున అటు తండ్రి తో నటించిన హీరోయిన్స్ తో పాటు, ఇటు కొడుకు నాగచైతన్య సరసన నటించిన భామలతోను నటించాడు. ‘యుద్ధం శరణం’ సినిమాలో నాగ చైతన్య తో పాటు నటించిన లావణ్య త్రిపాఠి తో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం లో నటించాడు. అంతే కాకుండా ‘రారండోయ్ వేడుక చేద్దాం’ సినిమా లో నటించిన ముద్దు గుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి తాజాగా ‘మన్మథుడు’ సీక్వెల్గా రాబోతున్న ‘మన్మథుడు 2’ లో కలిసి చేస్తున్నాడు.
ఈ విదంగా తండ్రి నాగేశ్వర్ రావుకు జోడిగా నటించిన భామలతో… ఇటు ఈ జెనరేషన్ లో కొడుకు నాగ చైతన్య సరసన నటించిన అమ్మడులతో వెండి తెర మీద జోడిగా నటించిన మొట్టమొదటి , ఏకైక కథానాయకుడిగా రికార్డు సాధించాడు. నాగార్జున తండ్రి జెనెరేషన్, అతడి జెనెరేషన్, మరో వైపు కొడుకు జెనెరేషన్.. మూడు తరాల వారితో నటించి కింగ్ అనిపించుకున్నాడు. ఏ హీరో దక్కించుకోలేని అరుదైన రికార్డు సాధ్యం చేసుకున్నాడు. మరి మునుముందు ఏ హీరో తో సాధ్యం అవుతుందో చూడాలి.