Home సినిమా గాసిప్స్ అఖిల్‌కి ప్రొడ్యూసర్ దొరికేశారోచ్!

అఖిల్‌కి ప్రొడ్యూసర్ దొరికేశారోచ్!

Akhil Surender Reddy Gets Producer

అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని తొలి చిత్రం ‘అఖిల్’ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆ తరువాత ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగులుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు అఖిల్. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని ఓకే చేశాడు ఈ యంగ్ హీరో.

సక్సె్స్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేయాలా అనే ఆలోచనలో పడ్డాడు. చాలా మందితో దీనికి సంబంధించిన సంప్రదింపులు జరిపాడు. కానీ అందరు హీరోలు వారివారి ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆయన అఖిల్‌కు తన కథను వినిపించాడు. ఇక సురేందర్ రెడ్డి ట్రాక్ రికార్డు చూసిన అఖిల్, వెంటనే ఓకే చెప్పాడు. అయితే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు.

తాజాగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా అఖిల్ తన నెక్ట్స్ మూవీని సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడనేది అక్కినేని ఫ్యాన్స్‌లో సంతోషాన్ని నింపేసింది. కాగా ఆయన నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad