Home సినిమా మజ్ను ఇక్కడ ఫట్టు.. అక్కడ మాత్రం సూపర్ హిట్టు!

మజ్ను ఇక్కడ ఫట్టు.. అక్కడ మాత్రం సూపర్ హిట్టు!

IMG 20200805 WA0026

టాలీవుడ్‌లో యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఏ సినిమా చేసినా సక్సెస్ మాత్రం అంతంత మాత్రంగానే వస్తోంది. ఇప్పటికే హీరోగా నాలుగు సినిమాల్లో నటించిన అఖిల్, అదిరిపోయే సక్సెస్‌ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. చేసిన ప్రతి సినిమా యావరేజ్, బిలో యావరేజ్‌గా మిగిలిపోయాయి. దీంతో తన నెక్ట్స్ చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ అక్కినేని బుల్లోడు. అయితే అఖిల్ నటించిన ఓ సినిమా మాత్రం యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది.

అఖిల్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘మిస్టర్ మజ్ను’ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. కాగా తాజాగా ఈ సినిమాకు ఏకంగా 100 మిలియన్ వ్యూస్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోని ఈ సినిమాకు నార్త్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.

ఏదేమైనా బాలీవుడ్ జనాలు తెలుగు సినిమాలంటే ఎందుకు పడిచస్తారో మరోసారి రుజువైందని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి అఖిల్‌కు ఇక్కడ అదిరిపోయే హిట్ రాకపోయినా, బాలీవుడ్‌లో అదిరిపోయే హిట్ వచ్చిందని అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అఖిల్ లవర్ బాయ్‌గా మెప్పించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలో పూజా హెగ్డేతో కలిసి అఖిల్ రొమాన్స్ చేస్తున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad