Home సినిమా 'అల్లు'తోనే నేనుంటా.. ఆకతాయి హీరోయిన్

‘అల్లు’తోనే నేనుంటా.. ఆకతాయి హీరోయిన్

అల్లుఅర్జున్, అల్లుశిరీశ్ ఇద్దరు అన్నదమ్ములు ఇండస్ట్రీ లో ఎవరికీ వారు గా అభిమానుల్లో పేరు సంపాదించుకునే దిశగా పయనిస్తున్నారు. ఇప్పటికే స్టైలిష్ స్టార్ గా అభిమానుల గుండెల్లో అర్జున్ చేరిపోయాడు. అలా అని శిరీష్ తక్కువేమి కాదు అన్నకు తగ్గ తమ్ముడే. చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి వచ్చాడు. బాలీవుడ్ లో, కోలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. టాలీవుడ్కి వచ్చే సరికి గౌరవం చిత్రంతో అరంగేట్రం చేశాడు. అయితే మంచి ప్రేమకథ చిత్రం చేయాలనీ ఉద్దేశ్యంతో ఇన్నిరోజులు వెయిట్ చేశాడట. ఈ గ్యాప్ లో శిరీష్ కి ఒక సినిమా చిక్కింది. అతని దృష్టి మళయాలంలో భారీ హిట్ సాధించిన సినిమా ‘ఏబీసీడీ’ వైపు మరలింది. అంతే ఇక ఈ సినిమా కి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. తాజాగా ఈ సినిమా నుండి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

మధుర ఎంటర్టైన్మెంట్, బిగబెన్ సినిమాస్ బ్యానర్ పై సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ‘ఏబీసీడీ’ అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి ట్యాగ్ తో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమాలో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ హీరోకి జోడిగా రుక్సార్ ధిల్లాన్ నటిస్తుంది. ఈ మూవీ నుండి విడుదలైన లిరికల్ వీడియో సాంగ్ లో వారి ప్రపంచాన్ని వారే మరచి పోతున్న ప్రేమ జంటగా కనిపిస్తారు.

‘మెల్లమెల్లమెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే…మెల్లమెల్లమెల్లమెల్లగా కన్నుల్లో మత్తులాగా అల్లావే.. ‘అంటూ కలా నిజమా తెలియని అయోమయంగా అల్లు పాడుకుంటుంటే, హీరోయిన్ వెర్షన్ లో ‘నేనుంటా నీడలా ఇలా నీతోనే అన్ని వేళలా’ అని హామీ ఇస్తుంటుంది. ఈ సాంగ్ యూత్ ని ఆకర్షించేలా ఉంది. జుడా శాండీ సంగీతాన్ని అందించగా, సిద్ శ్రీరామ్, అదితి ఆలాపన చేశారు. ఈ చిత్రాన్ని మార్చి 21వ తేదీన రిలీజ్ చేయుటకు సిద్దమవుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.

బ్యానర్: మధుర ఎంటర్టైన్మెంట్, బిగబెన్ సినిమాస్
నటీనటులు : అల్లు శిరీశ్, రుక్సార్ ధిల్లాన్
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
నిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి, యాష్ రాగినేని
సంగీతం: జుడా శాండీ
సాహిత్యం : కృష్ణ కాంత్
గాయకులు: సిద్ శ్రీరామ్, అదితి
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్ : వర్మ

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad