Home సినిమా ఏజెంట్‌ ఆత్రేయ వచ్చేస్తున్నాడోచ్ ..

ఏజెంట్‌ ఆత్రేయ వచ్చేస్తున్నాడోచ్ ..

Agent athreya

2019లో చిన్న సినిమాగా విడుదలయ్యి భారీ విజయం అందుకున్న సినిమాల్లో “’ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఒకటి. వైవిధ్యమైన కథా,కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా రికార్డుల వర్షం కురిపించింది. ముఖ్యంగా చిత్రంలో మిస్టీరియస్‌ కేసుల్ని ఛేదించే డిటెక్టివ్‌ ఏజెంట్‌ ఆత్రేయగా నవీన్‌ పొలిశెట్టి నటన అందరిని ఆకట్టుకుంది. సినిమా మంచి విజయం సాధించడంతో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ట్రైలజీ ప్రారంభిస్తున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా తన పుట్టినరోజును పుర‌స్కరించుకొని ఆ సినిమా ట్రైల‌జీగా వ‌స్తుంద‌ని ప్రక‌టించారు. దీని ప్రకారం ఈ చిత్రానికి మ‌రో రెండు భాగాలు రానున్నాయ‌న్న మాట‌.

ప్రస్తుతం డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్‌జె స్క్రిప్ట్‌ను రెడీ చేస్తునట్టు తెలుస్తుంది. స్వరూప్ డైరెక్ట్ చేస్తోన్న రెండో సినిమా పూర్తవ‌గానే ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ’ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ చిత్రం జ‌పాన్ లో కూడా విడుద‌ల కానుంది. జ‌ప‌నీస్ భాష‌లో డ‌బ్బింగ్ వెర్ష‌న్ ను సెప్టెంబ‌ర్ 11న మూవీ టీం జ‌పాన్ లో విడుద‌ల చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమా హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం రీమేక్ రైట్స్ కూడా అమ్ముడిపోయాయ‌ట‌.ఒక చిన్న తెలుగు సినిమా దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో రీమేక్ కావడం ఇదే మొదటిసారి. తర్వాత రెండు భాగాలు కూడా మొదటి స్టొరీకి కొనసాగింపుగా వస్తాయా లేదా అన్నది సినిమా విడుదలైతే తప్ప తెలిసే అవకాశం లేదు. టాలీవుడ్ షెర్లాక్ హోమ్స్ పేరు సాధించిన ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ’ రానున్న రోజుల్లో మరిన్నిమిస్టీరియ‌స్ కేసుల్ని చేదిస్తుందో వేచి చూడాలి.

ప్రస్తుతం “నవీన్‌ పొలిశెట్టి” లేటెస్ట్ కామెడీ సెన్సేషన్స్‌ స్టార్స్‌ ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణలతో కలిసి జాతి రత్నాలు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నాగ అశ్విన్‌ నిర్మాతగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఏదిఏమైనప్పటికీ చిన్న తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదిస్తున్నాయి అనడంలో ఎటువంటి అతియోశక్తి లేదు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad