Home సినిమా అప్పటి వరకే సినిమాలు చేస్తా..! రజినీకాంత్

అప్పటి వరకే సినిమాలు చేస్తా..! రజినీకాంత్

సినీరంగంలో స్టార్స్ గా ఒక వెలుగు వెలిగిన వారంతా రాజకీయంలో తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకొనుటకు రంగ ప్రవేశం చేస్తున్న విషయము అందరికి తెలిసిందె. ఎపుడెపుడు తమ హీరో రాజకీయంలోకి వస్తాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్తను అందించాడు సూపర్ స్టార్. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాడట.

తమిళ అభిమానులు కోరుకున్నట్లుగానే రజిని పార్టీ స్థాపించాడు. కానీ ఆ పార్టీ ని ఇప్పటివరకు పేరు కూడా పెట్టలేదు. క్షేత్ర స్థాయిలో నిలబెట్టలేరు. మరో పక్క హీరో కమల్ హాసన్ పార్టీ స్థాపించారు. తమిళ నాడులో అక్కడక్కడా అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపారు. ఈ నేపథ్యంలో అభిమానులకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడెప్పుడు రాజకీయంలోకి వస్తారు? సినిమాలు ఎప్పటి వరకు చేస్తారు? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తాజాగా అభిమానులలో నెలకొంటున్నా ప్రశ్నలకు సమాధానమిచ్చాడు రజినీ.. సార్వత్రిక ఎన్నికల పరంగా ఫ్యాన్స్ ని నిరాశ పరిచాను. అసెంబ్లీ ఎన్నికల సమయానికి అంతా సిద్ధమవుతుందని తెలిపారు. 2021 వ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల లో తప్పకుండ పోటీచేయడమేనని… అప్పటివరకు చిత్రాల్లో కొనసాగుతున్నట్లు ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి పార్టీ ని క్షేత్ర స్థాయి కి తీసుక వెళ్లేలా ప్రతిష్ఠమైన ప్లాన్ జరుగుతుందని తెలిపారు. నిజానికి ప్రస్తుత జరుగుతున్న ఎన్నికలలో సూపర్ స్టార్ పాల్గొంటారని ఎంతో ఆసక్తి తో ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.  తాజాగా రజిని చేసిన ప్రకటన వలన అభిమానులంతా ఖుషి అవుతున్నారు.

ప్రస్తుతానికి లైకా ప్రొడక్షన్స్ లో ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా దర్బార్ లో తలైవా నటిస్తున్నాడు. సూపర్ స్టార్ సరసన నయనతార చేస్తున్నారు. ఈ చిత్రములో రజిని ఇరవై ఏడేళ్ల తరువాత పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ప్రేక్షకులను అలరించుటకు సిద్దమవుతుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad