Home సినిమా దాదాపు 13 ఏళ్ల త‌రువాత‌..!

దాదాపు 13 ఏళ్ల త‌రువాత‌..!

సీనియ‌ర్ వెంక‌టేశ్ ఖాతాలో ప‌లు సంక్రాంతి హిట్స్ ఉన్నాయి. వాటిలో ల‌క్ష్మీ ఒక‌టి. 2006 సంక్రాంతికి విడుద‌లైన ఈ సినిమా అప్ప‌ట్లో వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేశ్ న‌టించిన తొలి చిత్ర‌మిది.

అయితే, ల‌క్ష్మీ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించినా వీవీ వినాయ‌క్‌, వెంక‌టేశ్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాలేదు. తాజా స‌మాచారం మేర‌కు 13 ఏళ్ల త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రాబోతుంద‌ట‌. వినాయ‌క్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్‌ను వెంకీకి వినిపించాడ‌ని, స్టోరీ న‌చ్చ‌డంతో వెంక‌టేశ్ కూడా సానుకూలంగా స్పందించ‌డాని స‌మాచారం.

అలాగే, వెంకీ తాజా చిత్రం ఎఫ్‌2 ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుండ‌గా, వెంకీమామ టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. అలాగే, త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు ద‌గ్గుబాటి వార‌బ్బాయి. వినాయ‌క్ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా..? అన్న విష‌య‌మై క్లారిటీ రావాల్సి ఉంది. వెంక‌టేశ్ తాజా మ‌ల్టీస్టార‌ర్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న తెర‌పైకి రాబోతుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad