
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా ఓకే చేస్తూ అందరికీ షాకిస్తున్నాడు. మహానటి ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తన 21వ చిత్రాన్ని ఓకే చేసిన ప్రభాస్, ఆ తరువాత బాలీవుడ్ దర్శకుడు ఓం రవుత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ అనే సినిమాను ఓకే చేశాడు.
కాగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, రావణుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. కాగా ఇదే విషయాన్ని సెప్టెంబర్ 3న రివీల్ చేయనుంది చిత్ర యూనిట్.
రామాయణం ఆధారంగా ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. మరి ప్రభాస్‌ను ఢీకొట్టే ఆ రావణుడు ఎవరు అనేది రేపు తెలియనుంది. కాగా ఈ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడనే వార్త బాలీవుడ్ వర్గాల్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.