Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

Navneet kaur

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, గొప్ప-పేద అనే తేడాలు చూడకుండా అందరికీ సోకుతోంది. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు, నేతలు, మంత్రులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతుండటంతో అందరూ కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ఈ కరోనా వైరస్ బారిన పలువురు సెలబ్రిటీలు కోలుకుంటుండటంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైన అందాల భామ నవనీత్ కౌర్, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు రాకపోయినా, ఆమె మొహం చూస్తే గుర్తు పట్టే ఇమేజ్‌ను ఆమె సొంతం చేసుకుంది. ఇక సినిమాలు తక్కువవుతున్న తరుణంలో ఆమె రాజీకీయాల్లో అడుగుపెట్టింది. ఇదే క్రమంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైంది. అయితే తాజాగా ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.

కాగా నవనీత్ కౌర్ కుటుంబంలో మొత్తం 10 మందికి కరోనా సోకినట్లు ఆమె పేర్కొంది. వారంతా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని, భయపడాల్సిన అవసరం లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఇక నవనీత్‌కు కరోనా సోకిందని తెలుసుకుని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. కాగా తెలుగు ప్రేక్షకులకు నవనీత్ కౌర్ శీను వాసంతి లక్ష్మీ చిత్రం ద్వారా సుపరిచితురాలు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసిన నవనీత్ క్రమంగా టాలీవుడ్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad