ఎన్నికల సమయాన బుల్లితెర, వెండి తెర నటీనటులు రాజకీయ రంగంలో ప్రవేసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రాజశేఖర్, జీవిత, యాంకర్ శ్యామల, శ్యామల భర్త నర్సింహారెడ్డిలు కలిశారు. తాజాగా మరో సినీనటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ని కలిసింది. అతని నివాసమైన లోటస్ పాండ్ లో నటి హేమ జగన్ ను కలవగా, జగన్ ఎంతో ఆప్యాతతో మాట్లాడి, క్షేమ సమాచారాలను తెలుసుకున్నాడు.
ఈ మధ్య జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి తన సత్తా చాటుకుంది. హేమ ‘మా’ ఎలక్షన్స్ లో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది. అంతకుముందు జరిగిన ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమర్ రెడ్డి ఏర్పాటు చేసిన సమైఖ్యాంధ్ర పార్టీ లో చేరి, ఆ పార్టీ తరపునా పోటీ చేయగా ఓడిపోయింది. ఈ ఎన్నికల సమయంలో నటి హేమ వైసీపీ జగన్ ను కలవడంలో ఆంతర్యమేంటో మునుముందు తేలియాల్సిందే.