Home సినిమా టాలీవుడ్ న్యూస్ నాన్-బాహుబలి రికార్డులకు ఎసరుపెట్టిన ఆచార్య

నాన్-బాహుబలి రికార్డులకు ఎసరుపెట్టిన ఆచార్య

Acharya Targets Non Bahubali Records

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తాడని, ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ అని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. కాగా ఇప్పటికే 40 శాతం షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా ప్రభావంతో షూటింగ్ వాయిదా వేసుకుంది.

ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ఇప్పుడే ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. గతంలో చిరు నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయగా, అది మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆచార్య చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసి మరోసారి బాక్సాఫీస్‌కు చుక్కలు చూపెట్టాలని మెగాస్టార్ భావిస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో చిరు ఏకంగా రూ.50 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుండటంతో ఈ సినిమాను ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఇట్టే అర్ధమవుతోంది. అటు ఈ సినిమా నాన్-బాహుబలి రికార్డులను లేపేయాలని, అందుకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసేందుకు ఆచార్య టీమ్ రెడీ అవుతోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad