Home సినిమా గాసిప్స్ చెర్రీ కండిషన్స్...కొర‌టాల‌ టెన్షన్

చెర్రీ కండిషన్స్…కొర‌టాల‌ టెన్షన్

Chiranjeevi Acharya story leaked

లాక్ డౌన్ కారణంగా బడా హీరోల సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో హీరోలెవరూ ముందుకు వచ్చే ధైర్యం చేయడం లేదు. అయితే కొన్ని సినిమాల పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. కొంతమంది దర్శకులు నిర్లక్ష్య ధోరణి కారణంగా సాధారణ సమయంలో కూడా మూవీ షూటింగ్ త్వరితగతిన పూర్తి కాకపోవడంతో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య. గతేడాది అక్టోబర్ లో మొదలైన ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 60 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకొలేదు.

ఈ ఏడాది సినిమా పూర్తి చేద్దాం అనుకున్నప్పటికీ మధ్యలో వచ్చిన కరోనా పరిస్థితులను తలకిందులు చేసింది. మరోవైపు చిరంజీవి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇవన్నీ పూర్తి కావాలంటే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఆచార్య పూర్తి కావాల్సిందే. ఒకవైపు ఆచార్య కొనసాగుతుండగానే కొరటాల శివ అల్లు అర్జున్ తో ఓ సినిమాను ప్రకటించాడు. దీంతో ఆగ్రహించిన రాంచరణ్ డైరెక్టర్ కు కండిషన్స్ పెట్టినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఏ పరిస్థితి ఉన్నా సరే సినిమా షూటింగ్ ను ఈ ఏడాది పూర్తి చేయాలని రాంచరణ్ డైరెక్టర్ కు కోరారట.

ముందుగా ప్రకటించినట్టు ఏప్రిల్ 9, 2021 సినిమా విడుదల చేయాలని, అందుకు తగ్గట్టుగా షూటింగ్ జరపాలని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తేదీలోగా సినిమా విడుదల కాకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని తీవ్ర స్వరంతో హెచ్చరించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం నవంబర్ తర్వాత మూవీ షూటింగ్ ను మొదలు పెట్టే అవకాశం ఉంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad