Home సినిమా గాసిప్స్ వివాదంలో చిక్కుకున్న"ఆచార్య"

వివాదంలో చిక్కుకున్న”ఆచార్య”

unnamed 1280x720 1

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా కథను అసోసియేట్ రైటర్ రాజేష్ నుండి అక్రమంగా దొంగలిచ్చారని అతడు ఆరోపించాడు.  గతంలో ఈ కథను మైత్రి మూవీ మేకర్స్ చెప్పగా ఇప్పుడు అదే కథతో ఆచార్య తెరకెక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు మూవీ అసోసియేషన్ మరియు రచయితల సంఘం వద్ద న్యాయం జరగలేదని అందుకే మీడియా ముందుకు వచ్చానని తెలిపాడు. కొంతమంది వ్యక్తులు న్యాయం చేయకపోగా తనని భయపేడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు.

ఈ విషయం ఒక్కసారి వెలుగులోకి రావడంతో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు వెబ్ మీడియా కూడా పలు వార్తా కథనాలు ప్రచురితం చేసింది. దీంతో సదరు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆచార్య సినిమా కథలు కొరటాల శివ రాశారని దానిపై పూర్తి హక్కులు వారికి మరియు సదరు నిర్మాణ సంస్థకు ఉంటాయని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అధికారికంగా ప్రకటించింది. అయితే రైటర్ రాజేష్ మాత్రం తనకు న్యాయం చేయాలని లేకుంటే కోర్టుకు వెళ్తానని తెలిపారు.

ఈ వివాదం గత కొన్ని నెలలుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం గురించి మెగాస్టార్ చిరంజీవికి తెలిసిన ఆయన ఇప్పటివరకూ స్పందించలేదు. గతంలో కొరటాల శివ రాసిన శ్రీమంతుడు సినిమా కూడా కాపీ రైట్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో కోర్టు కొరటాల శివకు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చింది. ఇప్పుడు రాజుకున్న ఆచార్య వివాదం కోర్టు మెట్లు ఎక్కితే అసలు బాగోతం బయట పడుతుందని కొంతమంది రచయితలు అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad