Home సినిమా బాలీవుడ్ న్యూస్ కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

abhishek bachan corona thum

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. కాగా ఎక్కువ శాతం కరోనా నుండి కోలుకోవడంలో విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఈ కరోనా వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. అమితాబ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడటంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

అయితే తమ అభిమానుల ప్రార్ధనలు, వైద్యుల సేవల వల్ల తాము ఒక్కొక్కరిగా కరోనా నుండి కోలుకుంటున్నారు. ఇప్పటికే అమితాబ్ కోడలు ఐశ్వర్యా రాయ్, మనుమరాలు ఆరాధ్యాలు కరోనా నుండి కోలుకోగా రీసెంట్‌గా అమితాబ్ కూడా కరోనా నుండి కోలుకున్నాడు. తాను కోలుకోవడానికి అభిమానుల ప్రార్ధనలే కారణమని అమితాబ్ చెప్పుకొచ్చాడు. కాగా తాజాగా అభిషేక్ బచ్చన్ కూడా కరోనా నుండి కోలుకున్నాడని, ఆయన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు అమితాబ్ తెలిపాడు.

కరోనా వైరస్ బారిన పడిన అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులు ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకోగా వారికి కరోనా నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ చేసినట్లు అమితాబ్ వెల్లడించారు. తమ కుటుంబ సభ్యులు కరోనాను జయించడంలో తమ అభిమానుల ప్రార్ధనలు బాగా పనిచేశాయని ఆయన ఈ సందర్భంగా తెలిపాడు. ఇక కరోనాతో పోరాడుతున్న అందరూ త్వరగా కోలుకోవాలని అమితాబ్ ఈ సందర్భంగా కోరారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad