Home సినిమా అదరగొట్టేస్తున్న 'అభినేత్రి 2' టీజర్..!

అదరగొట్టేస్తున్న ‘అభినేత్రి 2’ టీజర్..!

ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, నటుడిగా తానేంటో అందరికి తెలుసు. ఈ మధ్య హర్రర్ సినిమాలలో నటిస్తూ అందరిని భయపెట్టిస్తున్నాడు. 2016లో తమిళంలో తమన్నా ప్రధాన పాత్రలో ప్రభుదేవా నటించిన సినిమా ‘దేవి’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అభినేత్రి’ గా ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించి తెరకెక్కించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించింది. సినిమాకి సీక్వెల్ గా ‘దేవీ2’ తమిళంలో సిద్దమవుతుండగా.. తెలుగులో ‘అభినేత్రి 2’ గా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రాబోతుంది. అయితే ఈ సారి ‘నందిత శ్వేత’ కూడా ఈ సినిమాలో కనిపించనుంది.

ఈ సినిమా నుంచి తాజా టీజర్ విడుదలైంది. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్నా టీజర్ లో ప్రభుదేవా, తమన్నా, కోవై సరళల ల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలను కట్ చేస్తూ చూపించారు. ప్రభుదేవా శరీరంలో దయ్యం ఉన్నట్లు వీక్షించవచ్చు. కోవై సరళ ‘ఒక దెయ్యం కాదయ్యా .. రెండు దెయ్యాలు’ అంటూ ప్రభుదేవాతో డైలాగ్ వేసే సన్నివేశంలో.. కోవై సరళ భయం.. ప్రభుదేవా సైలెన్స్ మరింత ఆసక్తిని పెంచింది. మే 1వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మొదటిభాగాని కన్నా ఈ రెండో భాగం మరింత విజయాన్ని సాదిస్తుందని నమ్మకంతో ఉన్నారట ప్రభుదేవా.

Abhinetry 2 First Look Teaser | Prabhu Deva | Tamannaah | Nandita Swetha | Vijay | Abhishek Pictures

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad