Home సినిమా టాలీవుడ్ న్యూస్ మెగాస్టార్ పుట్టినరోజున 65 స్పెషల్!

మెగాస్టార్ పుట్టినరోజున 65 స్పెషల్!

65 Celebrities To Take Part In Chiru Birthday Fest

ప్రతియేటా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును ఆగస్టు 22న ఎంత వైభవంగా నిర్వహిస్తారో అందరికీ తెలిసిందే. ఆరోజు ప్రత్యేక వేడుకలను మెగాస్టార్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా నిర్వహించి, చిరుపై తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. కాగా ఈయేడు చిరు పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావించిన అందరి ఆశలపై కరోనా మహమ్మారి నీళ్లు జల్లింది. దీంతో చిరు పుట్టినరోజు వేడుకలను ప్రత్యేకంగా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆగస్టు 22న చిరు 65 ఏళ్ల వయస్సులో అడుగుపెడుతుండటంతో, ఆయన పుట్టినరోజు వేడుకలో భాగంగా 65 మంది సెలబ్రిటీలతో చిరు కామన్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయించే ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ వేడుకను మెగా ఫ్యాన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆ 65 మంది సెలబ్రిటీలు ఎవరా అనే ఆసక్తి ప్రస్తుతం సర్వత్రా నెలకొంది. ఇక చిరు మాత్రం తన పుట్టినరోజును కేవలం కుటుంబ సభ్యులతోనే జరుపుకోనున్నాడు.

కాగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా అభిమానులు తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించవద్దని చిరు తన అభిమానులను కోరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో తన అభిమానులు ఇంటి వద్దే ఉంటూ క్షేమంగా ఉండాలని చిరు వారిని కోరనున్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య సినిమాకు సంబంధించి ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను దర్శకుడు కొరటాల శివ ప్లా్న్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad