Home సినిమా సీబీఐ ఆఫీసర్.. నయనతార..!

సీబీఐ ఆఫీసర్.. నయనతార..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకొని అభిమానుల ఫాలోయింగ్ పెంచుకున్న హీరోయిన్స్ లో నయనతార ఒకరు. ఈ మధ్య టాలీవుడ్, కోలీవుడ్, మలయాళం లోను వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. రామ్ చరణ్ నిర్మాతగా మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డిలో సిద్ధమ్మగా నయనతార నటిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రల వారు, నయతారకు ఉన్నటువంటి పాపులారిటీని క్యాష్ చేసుకోవలనుకుంటున్నారు. తమిళంలో విజయవంతమైన నయనతార సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

నయనతార IAS ఆఫీసర్ గా నటించిన ‘అరమ్’ సినిమా కోలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ ‘అరమ్’ సినిమాను తెలుగులో ‘కర్తవ్యం’గా రిలీజ్ చేశారు. అలాగే నయనతార సీబీఐ ఆఫీసర్ గా నటించిన తమిళ చిత్రం ‘ఇమైక్క నోడిగల్’ అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. మరోసారి ఈ సినిమాను తెలుగులో ‘అంజలి సీబీఐ ఆఫీసర్’ పేరుతో, ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు.

ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించగా, నయనతార ప్రధాన పాత్ర పోషించారు. నయనతార భర్తగా ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి, విక్రమాదిత్య అనేటువంటి అతిథి పాత్రలో నటించాడు. అధర్వమురళి, రాశిఖన్నా జంటగా నటించారు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా పాత్ర పోషించాడు. ఈ సినిమాకి తెలుగు హక్కులను కొనుగోలు చేసిన నిర్మాతలు సిహెచ్ రాంబాబు, అచంట గోపీనాథ్ ఈ సినిమాను విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్పై విడుదల చేయబోతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad