Home సినిమా సినిమాల్లో ప‌డి పిల్ల‌ల‌ను క‌న‌లేక‌పోయిన తార‌లు

సినిమాల్లో ప‌డి పిల్ల‌ల‌ను క‌న‌లేక‌పోయిన తార‌లు

PicsArt 08 03 03.47.46

ఏ స‌మ‌యంలో చేయాల్సింది ఆ స‌మ‌యంలోనే చేయాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అందుకే ఈడు రాగానే అమ్మాయిలకైనా అబ్బాయిల‌కైనా పెళ్లిళ్లు చేస్తుంటారు. అలా చేయ‌డం వ‌ల్ల వారికి 50 ఏళ్లు పైబడి స‌రికే వాళ్ల వార‌సులు చేతికొస్తారు. కానీ కొంద‌రు మాత్రం పెళ్లి చేసుకోవాల్సిన స‌మ‌యంలో పెళ్లిని, పిల్ల‌ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తారు. ఆ త‌ర్వాత తెగ ఫీలైపోతుంటారు. అరే అలా చేయ‌కుండా ఉంటే బాగుండేది. పెళ్లి స‌రైన స‌మ‌యంలో చేసుకుని పిల్ల‌ల‌ను క‌ని ఉండాల్సింది అని అనుకుంటుంటారు. ఈ కోవ‌లో సాధార‌ణ మ‌నుషులే కాదు చాలా మంది స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. మంచి వ‌య‌సులో ఉన్న‌ప్పుడు సినిమాల్లో బిజీ వ‌ల్ల‌…..కొంత మంది హీరోయిన్లు వారి జీవితాల‌ను సినిమాల‌కు అంకితం చేశారు. ఆ సినిమాల మీద ఉన్న ఆస‌క్తితో మాతృత్వానికి దూర‌మ‌య్యారు. అలాంటి వారిలో ఒక‌రు న‌టి రేవ‌తి. చాలా స‌హ‌జంగా న‌టించ గ‌ల అతిత‌క్కువ మంది హీరోయిన్స్ లో ఒక‌రు. ఇంట‌ర్ చ‌దువుతుండ‌గా సినీరంగంలోకి అడుగుపెట్టింది. తెలుగు, త‌మిళ , హిందీ చిత్రాల్లో న‌టించింది. త‌న అన‌న్య‌మైన ప్ర‌తిభాపాఠ‌వాలతో ఎన్నో అవార్డుల‌ను అందుకున్నారు. కెరీర్ మంచి పీక్ లో ఉన్న‌ప్పుడు సినిమాటోగ్రాఫ‌ర్ సురేష్ చంద్ర‌మీన‌న్‌ను పెళ్లి చేసుకుంది. కానీ వీరికి ఇప్ప‌టికీ పిల్ల‌లు లేరు. దీనికి కార‌ణం రేవతి సినిమాల్లో న‌టించ‌డ‌మేన‌ని కొంద‌రు చెబుతుంటారు. పిల్ల‌లు పుడితే అందం దెబ్బ‌తింటుంద‌ని…అలా అయితే సినిమాలు రావ‌ని భావించి కొంత‌కాలం పాటు కావాల‌నే రేవ‌తి పిల్ల‌ల‌ను క‌న‌లేదనే వాద‌న‌లు ఇప్ప‌టికీ ఉన్నాయి. సినిమా కంటే రియ‌ల్ లైఫ్ చాలా ముఖ్య‌మని తెల‌సుకునే పాటికి…. వ‌య‌సు దాటి పోయింది. పిల్ల‌ల‌ను క‌న‌లేక‌పోయారు. దీంతో ఒక పాప‌ను ద‌త్త‌త తీసుకుని పెంచుకున్నారు రేవ‌తి దంప‌తులు.

పిల్ల‌లను కాద‌నుకున్న మ‌రో న‌టి విజ‌య‌శాంతి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఎన్నో గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించింది. అంచెలంచెలుగా టాప్ హీరోయిన్ గా ఎదిగింది. లేడీ ఓరియెంటేడ్ మూవీలు చేయ‌డంలో దిట్ట‌. అలా ఎన్నో ర‌కాల పాత్ర‌లు చేసి లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ అగ్ర‌హీరోలంద‌రితో న‌టించి మెప్పించింది. హీరోయిన్ గా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే….. శ్రీనివాస్ ప్ర‌సాద్‌ను పెళ్లి చేసుకుంది. అప్ప‌ట్లో కొంత కాలం పిల్ల‌ల‌ను వ‌ద్ద‌నుకున్నారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత …పూర్తిగా పిల్ల‌ల మీద ధ్యాస పెట్ట‌లేక‌పోయింది. రాజ‌కీయాల్లో బిజీ అయిపోయిన త‌ర్వాత త‌న‌కు స‌మాజ‌మే పిల్ల‌లని….. అందుకే పిల్ల‌ల‌ను క‌న‌లేద‌ని బ‌హిరంగంగానే చెప్పారు విజ‌య‌శాంతి. చాలా కాలం గ్యాప్ త‌ర్వాత …స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో బిజీ అయిపోయి పిల్ల‌ల‌ను క‌న‌లేక‌పోయిన మ‌రో న‌టి ఊర్వ‌శి శార‌ద‌. దాదాపు అన్ని భాష‌ల్లో న‌టించి మెప్పించింది. స్టార్ హీరోయిన్‌గా ఉన్న‌ప్పుడు ….. న‌టుడు చ‌లంను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే చ‌లంకి అప్ప‌టికే పెళ్లై పిల్ల‌లు ఉన్నారు. అయితే భార్య చ‌నిపోవ‌డంతో… శార‌ద‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ వీరికి సంతానం లేదు. ఆ త‌ర్వాత చ‌లం చ‌నిపోవ‌డంతో శార‌ద‌ ఒంట‌రిగా ఉంటుంది. ఇక స్టార్ హీరోయిన్ గా ఎదిగి…ఆ బిజీలో పిల్ల‌ల‌ను క‌న‌లేక‌పోయిన మ‌రో హీరోయిన్ జ‌య‌ప్ర‌ద‌. హీరోయిన్ గా జ‌య‌ప్ర‌ద సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. అతి చిన్న య‌వ‌సులోనే స్టార్ స్టేట‌స్‌ను సంపాదించుకుంది. అన్నీ ఉన్నా కానీ…. నోరూరా అమ్మా అని పిలిచే బిడ్డ‌లు లేరు. జ‌య‌ప్ర‌ద ప్రొడ్యూస‌ర్ శ్రీకాంత్ న‌హ‌తాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అప్ప‌టికే ఆయ‌న‌కు పెళ్లై ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. ఆయ‌న‌తో కూడా ఎక్కువు కాలం క‌లిసి ఉండ‌లేక‌పోయింది. దీంతో పిల్ల‌లు క‌న‌లేక‌పోయింది. ఆ త‌ర్వ‌త ఇంక ఎవ‌ర్నీ పెళ్లి చేసుకోకుండా….. ఒంట‌రిగా ఉండిపోయింది. అనంత‌రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌జాసేవ చేసింది. ప‌లుమార్లు ఎంపీగా సేవ‌లందించారు. పిల్ల‌లు లేర‌నే బాధ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు …. త‌న‌సోద‌రి కొడుకును ద‌త్త‌త తీసుకుని సొంత కొడుకులా పెంచుకుంది. పెళ్లి కూడా చేసింది. ఇలా కొంతం మంది స్టార్ హీరోయిన్స్‌కు పెళ్లి చేసుకున్నాకానీ పిల్ల‌లు లేరు.అప్ప‌ట్లో పిల్ల‌లు వ‌ద్ద‌నుకుని….. ఇప్పుడు పిల్ల‌లుంటే బాగుండేదేమో అని ఫీల‌వుతున్నారు.
………………………………………

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad