విక్టరీ వెంకటేష్ ఎఫ్2 సినిమా భారీ హిట్ సాధించింది. ఫన్ అండ్ ఫ్రెస్టేషన్ అంటూ ఇద్దరు హీరోలు కలిసి ప్రేక్షకులను నవ్వించారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన దగ్గుబాటి, కొణిదెల కలిసి పెద్ద హిట్ కొట్టారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన మరో కుటుంబంతో కలిసి సినిమా తీయబోతున్నారు.
అక్కినేని నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ కలిసి చేస్తున్న సినిమా ‘వెంకీమామ’. నిజ జీవితంలో కూడా వీరిద్దరూ మామ, అల్లుడులు కావడంతో ఈ చిత్రానికి ఈ పేరు పెట్టారు కావచ్చు. ఎఫ్ 2 సూపర్ హిట్ సాధించడంతో, రాబోయే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఇప్పటినుండే మొదలయ్యాయి. ఈ మూవీ కూడా మంచి కామేడీ ఎంటర్టైన్మెంట్ గా ప్రేక్షకులను నవ్వించడానికి తెరకెక్కబోతుంది.
బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘వెంకీ మామ’ సినిమాలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య నటిస్తున్నారు. కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. వెంకీ ఈ సినిమాలో పల్లెటూరి వాడిగా కనిపించనున్నాడు. పల్లెటూరిలో వెంకీ చేయబోయే హంగామా చాలా ఉంటుందట. ఎఫ్ 2 సినిమాలో కన్నా ఎక్కువ కామెడీ పండించబోతున్నారట ఈ మామ అల్లుడులు. ఈ వినోద భరితమైన సినిమా కోసం మనమందరం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.