
ఒకప్పుడు సినిమా రికార్డులతో బాక్సాఫీస్ ట్రెండ్ సెట్ అయ్యేది. అభిమానులు కూడా తమకు ఇష్టమైన హీరో సినిమాకు రికార్డులు నెలకొల్పి తమ అభిమానాన్ని చాటుకునే వారు. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రెండ్ మారింది . సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కువ లైకులు,షేర్లు,ట్వీట్లు వస్తే వారే బాక్సాఫీస్ మగాడు అనే విధంగా మారిపోయింది. గత కొంతకాలంగా ట్విట్టర్ లో ట్రెండ్ చేయడం ఫాన్స్ కు సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు ఈ ట్రెండ్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ కు కారణమవుతున్నాయి.
ముఖ్యంగా పవన్, ఎన్టీఆర్ ఫాన్స్ – మహేష్ బాబు ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. గత నెలలో నెలలో పవన్ కళ్యాణ్ అభిమానులు ట్వీట్ల రికార్డు మోత మోగించారు. తమ హీరో పుట్టినరోజు సెప్టెంబర్ 2న కాగా.. 50 రోజుల ముందే #AdvanceHBDPawanKalyan హ్యాష్ ట్యాగ్‌తో బర్త్‌డే ట్రెండ్ మొదలుపెట్టారు. 27 మిలియన్‌కు పైగా ట్వీట్స్‌తో ట్విట్టర్‌ను షేక్ చేశారు. అంతకు ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే రోజున #HappyBirthdayNTR హ్యాష్ ట్యాగ్‌తో 21.5 మిలియన్ ట్వీట్లు చేశారు ఫ్యాన్స్. వీరికి పోటీగా మహేష్ అభిమానులు కూడా 3 కోట్లకు పైగా ట్వీట్లతో ఇండియా ట్విట్టర్ చరిత్రలోనే ఇప్పటి వరకు లేని బిగ్గెస్ట్ ట్రెండ్‌ను సృష్టించారు. అయితే సర్కారు వారి పాట మూవీ నుండి ఏటువంటి అప్డేట్ విడుదల కావటం లేదని తెలియడంతో అభిమానుల ఒకింత నిరాశకు గురయ్యారు.
ఈ తరుణంలో ఇతర అభిమానులు అసలు మహేష్ బాబు పుట్టినరోజు జరుగుతుందా ! ఆ రోజు మీరు ట్రెండ్ సెట్ చేస్తారా ? అయినా మహేష్ బాబు పుట్టినరోజు ఎప్పుడో మీకు తెలుసా ? లేక మమ్మల్ని గుర్తు చేయమంటారా అని సెటైర్స్ వేస్తున్నారు. దీనితో సోషల్ మీడియా వేదికగా మొదలయ్యాయని అని ఫిలిం వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ ఫ్యాన్స్ దీనిపై స్పందిస్తూ పుట్టినరోజు నాడు మేము ఏమిటో చూపిస్తామని శపథం పట్టారు. చివరకు ఈ ట్రెండ్ వార్స్ ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి మరి .