
మగధీర తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఓ ట్రెండ్ సెట్ చేసిన మూవీ. జూలై 31వ తేదీకి ఆ సినిమా రిలీజై 11 ఏళ్లు అయ్యింది. రాంచరణ్ హీరోగా సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కింది. సోషియా ఫాంటసీ మూవీగా వచ్చిన ఈ మూవీ…ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాజమౌళి టేకింగ్, రాంచరణ్ నటవిశ్వరూపం, కాజల్ అందచందాలు, సినిమా నిర్మాణ విలువలు….అన్నీ కలిపి సినిమాను సూపర్ డూట్ హిట్ చిత్రంగా నిలిపాయి. పోరాట సన్నివేశాలు అబ్బురపరిచేలా ఉంటాయి. 40 కోట్లు పెట్టి తీసిన ఆ సినిమా 100 కోట్లుపైన వసూలు చేసింది. బాహుబలితో తెలుగు సినిమా ప్లాన్ ఇండియా స్థాయికి ఎదిగినా ……దానికి బీజం మాత్రం మగధీర దగ్గరే పడింది. మగధీరని సోషియా ఫాంటసీ మూవీగా తెరకెక్కించిన రాజమౌళి…… బాహుబలితో ప్రేక్షకుల్ని మరో కొత్తలోకంలోకి తీసుకెళ్లారు. మగధీర సినిమా విడుదలైన 11 ఏళ్లు పూర్తియిన సందర్భంగా… మగధీర తర్వాత రాంచరణ్ హీరోగా ఎలా ఎదిగారు..దర్శకుడు ఏ రేంజ్‌కి చేరుకున్నారనే విషయాలను ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మగధీర విడుదలై 11 ఏళ్లు పూర్తి య్యాయి. ఈ 11 ఏళ్లలో రామ్‌చరణ్ నటుడిగా ఎన్నో మెట్లుకు పైకి ఎదిగారు. మగధీర సాధించిన కమర్షియల్ హిట్ తో…… చిరంజీవి వారసుడిగా రాంచరణ్ గట్టి పునాది వేసుకోగలిగారు.
ఆ తర్వాత మాస్ హీరోగా తండ్రి వారసత్వాన్ని కొనసాగించగల సత్తా ఉన్న నటుడు అనిపించుకున్నాడు. ఈ 11 ఏళ్లలో రామ్‌చరణ్ 10 సినిమాలు పూర్తి చేశాడు. ఆరంజ్, రచ్చ, నాయక్, జంజీర్ , ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ, ధ్రువ, రంగస్థలం, వినయవిధేయ రామ సినిమాలు చేశాడు. వీటిలో ప్లాపులు ఉన్నాయి. హిట్లు ఉన్నాయి. మళ్లీ 11వ సినిమాగా తిరిగి రాజమౌళి దర్శకత్వంలో….. ఆర్ ఆర్ ఆర్ లోనటిస్తున్నాడు ఇందులో ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. నిజానికి ఈ సినిమా ఇద్దరి కెరీర్లకు ఎంతో ముఖ్యమైనదనే చెప్పాలి. బాహుబలి వంటి ట్రెండ్ సెట్ మూవీ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో….. ఆర్ ఆర్ ఆర్ పై భారీ అంచనాలున్నాయి. మగధీర తర్వాత రాజమౌళి కెరీర్ చూస్తే…. జస్ట్ ఈ 11 ఏళ్లలో నాలుగంటే నాలుగు సినిమాలే తీశారు. మర్యాదరామన్న, ఈగ రెండు ప్రయోగాలే. అయినా మంచి విజయాలు సాధించాయి. ఆ తర్వాత బాహుబలి వంటి భారీ ప్రాజెక్టుని తలకెత్తుకుని…. దాదాపు నాలుగున్నరేళ్లు ఆ సినిమాతోనే కాలక్షేపం చేశారు. ఇక బాహుబలి సిరీస్ తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. నిర్మాతలకు కాసుల పంట పండింది.
ఆ సినిమా కోసం తాను పడిన కష్టం రాజమౌళికి ఎంతో పేరు తెచ్చింది. దేశవ్యాప్తంగా దర్శకధీరుడి పేరు మారుమ్రోగిపోయింది. చరణ్ జంజీర్ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా ….దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కలేదు. రాజమౌళి మాత్రం బాహుబలితో….. తన సత్తా చూపించారు. ప్రభాస్‌కి పాన్ ఇండియా స్టార్ అనే పేరు తెచ్చారు. ఇక ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత రాజమౌళి, రామ్‌చరణ్ మళ్లీ కలిశారు. ఈ సారి ఈ క్రేజీ కాంబినేషన్ ….ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.