Home సినిమా బిగ్‌బాస్ భారీ ఆఫ‌ర్‌ను వ‌దుల‌కున్న హైప‌ర్ ఆది..కార‌ణ‌మేంటంటే....

బిగ్‌బాస్ భారీ ఆఫ‌ర్‌ను వ‌దుల‌కున్న హైప‌ర్ ఆది..కార‌ణ‌మేంటంటే….

hyper aadi

ఈటీవీ వ‌స్తున్న జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో మొద‌టి నుంచి టీఆర్పీ రేటింగ్ లో అదిరిపోతుంది. జ‌నం ఈ షోకి అంత‌లా క‌నెక్ట్ అయ్యారు. టీమ్ లీడ‌ర్లు…ఆయా టీమ్‌లో ఉన్న స‌భ్యుల‌తో క‌లిసి పెట్టే కిత‌కిత‌లు ఓ రేంజ్‌లో ఎంట‌ర్ టైన్ చేస్తున్నాయి. అందుకే ఆ షో కోసం ప్ర‌తీ వారం కోట్లాది మంది ఎదురుచూస్తుంటారు. ఎన్ని షోస్ వ‌చ్చినా జ‌బ‌ర్ద‌స్త్ ముందు నిల‌బ‌డ‌టం లేద‌న్న‌ది వాద‌న కూడా ఉంది. ఈ షో ద్వారా ఎంద‌రో క‌మెడియ‌న్స్ ప‌రిచ‌య‌మై ఆర్థికంగా నిల‌దొక్కుకున్నారు. ప‌లు షోలు చేస్తూ సినిమాల్లో కూడా ఛాన్సులు అందిపుచ్చుకున్నారు.

హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లు అయితే….ఈ షోస్‌కి హైలెట్‌గా నిలుస్తుంటారు. ఆది పేల్చే పంచ్‌లు, సుధీర్ మీద ప‌డే రొమాంటిక్ పంచ్‌లు….. జ‌నాన్ని ఓ రేంజ్ లో ఎంట‌ర్ టైన్ చేస్తుంటాయి. ఇక రియాల్టీ షోస్ లో బిగ్ బాస్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ మొద‌లు కోలివుడ్, టాలీవుడ్ ఇలా అన్ని చోట్లా… బిగ్ బాస్ దుమ్మురేపుతోంది. ఇప్ప‌టికే తెలుగులో మూడు సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. నాల్గ‌వ సీజ‌న్‌కు స‌ర్వం సిద్ధ‌మౌతోంది. హోస్ట్ నాగార్జున‌తో ప్రోమో లాంచింగ్ కూడా అయ్యింది. కంటెస్టెంట్స్ కూడా దాదాపు ఖ‌రారు అయ్యార‌ని తెలిసింది.

మ‌రికొంద‌రు కోసం వేట కొన‌సాగిస్తున్నార‌ట‌. అయితే దీనికి సంబంధించి ఒక వార్త ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. అదేంటి అంటే…లేటెస్ట్ కామెడీ సెన్సేష‌న్ హైప‌ర్ ఆదికి కూడా బిగ్ బాస్ ఆఫ‌ర్ వ‌చ్చిందట‌. కానీ దాన్ని అంగీక‌రించ‌లేద‌ని వార్త షికార్లు చేస్తోంది. హైప‌ర్ ఆది గురించి మ‌న‌కు తెలిసిందే. ఫ్రెండ్స్ తో క‌లిసి స‌ర‌దా స్కిట్లు వేసుకునే ఒక యువ‌కుడు….జ‌బ‌ర్ద‌స్త్ షోలో చిన్న క్యారెక్ట‌ర్ తో ఎంట్రీ ఇచ్చి….అన‌తీ కాలంలోనే టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. షోలోనే టాప్ టీమ్ లీడ‌ర్ గా నిల‌దొక్కుకున్నాడు. జ‌బ‌ర్దస్త్ తో పాటు ఢీ షో చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు.

అప్పుడు ఈవెంట్ల స్కిట్ల‌తో దుమ్మురేపుతున్నాడు. త‌క్కువు కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హైప‌ర్ ఆదిని….బిగ్ బాస్ షోలో పెట్టుకోవాల‌ని నిర్వాహ‌కులు ఆహ్వానం ప‌లికార‌ట‌. ఇందుకోసం భారీ మొత్తంలో ఆఫర్ చేశార‌ని తెలిసింది. ఎంతా అంటే అత‌ను జీవితంలో ఎప్పుడూ ఊహించ‌లేనంత అని తెలిసింది. ప్ర‌స్తుత‌మున్న క్రేజ్ ను బ‌ట్టి బిగ్ బాస్ లో పాల్గొంటే ఆదికి …..ఎంత‌లేద‌న్నా రోజుకి ల‌క్ష రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఉంటుంద‌ని టాక్. అయితే ఆదికి ఎపిసోడ్‌కి 7 ల‌క్ష‌ల దాకా ఇవ్వ‌డానికి ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. ఆ లెక్క‌నే బిగ్ బాస్ షో అయిపోయే లోపు ….కోటీశ్వ‌రుడు అయిపోవ‌డం ఖాయ‌మే. కానీ ఆ ఆఫ‌ర్‌ను వ‌ద్ద‌నుకున్న‌ట్టు తెలిసింది. న‌మ్ముకున్న జ‌బ‌ర్దస్త్ ని వ‌ద‌ల‌డానికి ఆది ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌.

త‌న ఆఫ‌ర్‌కి ఇచ్చిన సంస్థ‌ను మ‌ధ్య‌లో వ‌దిలేయ‌డం స‌రి కాద‌ని భావించాడ‌ట‌. ఎందుకంటే జ‌బ‌ర్ద‌స్త్ షోలో హైప‌ర్ ఆది షోనే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌. అత‌ని పంచ్ ల‌కోసం, అత‌ని టీమ్ స‌భ్యులు పండించే న‌వ్వుల కోసం ప్ర‌తీ వారం …ఈగ‌ర్‌గా ఎదురుచూస్తుంటారు. అంతేకాదు..యూట్యూబ్ లోనూ మంచి వ్యూస్ ఉంటాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే జ‌బ‌ర్ద‌స్త్ రేటింగ్ కూడా హైప‌ర్ ఆదిపైనే బేస్ అయ్యింద‌నే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ షోలో అత‌ను లేడు అని తెలుస్తుందో…అప్పుడే చాలా వ‌ర‌కు ఇంకెందుకేలా చూడ‌టం అనుకునే ప్ర‌మాదం కూడా ఉంది. అందుకే బిగ్ బాస్ ఆఫ‌ర్‌ను హైప‌ర్ ఆది సున్నితంగా తిర‌స్క‌రించాడ‌ట‌. ఈ వార్త ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad