Home సినిమా నాన్న సినిమాలో న‌టించిన ఆ చిన్నారి ఓ పెద్ద స్టార్ కూతురే

నాన్న సినిమాలో న‌టించిన ఆ చిన్నారి ఓ పెద్ద స్టార్ కూతురే

Sara Arjun

సినిమాల్లో క‌నిపించే కొన్ని పాత్ర‌లు మ‌నకు బాగా గుర్తిండిపోతాయి. ఆ క‌ళాకారుడి న‌ట‌న వ‌ల్ల‌ కానీ, ఆ పాత్ర తాలూకా ప్రాధాన్య‌త వ‌ల్ల‌గానీ …కార‌ణ‌మైదైనా స‌రే ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచిపోతుంగ‌టాయి. వాళ్ల అసలు పేరును కూడా మర్చిపోయి….. సినిమా పేరుతోనే ఎక్కువ మంది గుర్తు పెట్టుకుంటారు. అలాంటి పాత్రలు ఆయా పాత్ర పోషించిన‌ నటుల జీవితాన్ని కూడా మారుస్తాయి.


అలా మనకి గుర్తుండిపోయిన పాత్రల్లో ఒక‌టి నాన్న సినిమా లో వెన్నెల పాత్ర. త‌మిళంలో రూపొందిన ఈ సినిమా…. నాన్న పేరుతో మ‌న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌ధాన పాత్ర‌ల్లో విక్ర‌మ్‌, అనుష్క, అమ‌లాపాల్ కీల‌క పాత్ర‌ల్లో నటించారు. ఈ సినిమాలో విక్ర‌మ్ మ‌తిలేనినాన్న పాత్ర‌లో ఎంత‌గా ఒదిగిపోయారు…..అదే స్థాయిలో విక్ర‌మ్ బిడ్డగా వెన్న‌ల‌ పాత్ర‌లో న‌టించిన ఆ అమ్మాయి చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో విక్రమ్ పాత్ర, వెన్నెల మధ్య వచ్చే ఆ ఎమోషనల్ ఈ సీన్ చూసి….. చాలామంది ఏడ్చే ఉంటారు. ఇంత చిన్న వ‌య‌సులోనే ఎంతో అద్భుతంగా న‌టించిన ఆ చిన్నారి ఎవ‌రో చాలా మందికి తెలియ‌దు. ఆ అమ్మాయి ఓ ప్ర‌ముఖ న‌టుడి కుమార్తె. ఎక్కువుగా విల‌న్ పాత్ర‌ల్లో క‌న్పిస్తుంటాడు. నాన్న సినిమాలో వెన్నెల పాత్ర పోషించిన నటి పేరు సారా అర్జున్. 2011లో వచ్చిన ఫోర్ నాట్ ఫోర్ (404) సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించింది సారా. తర్వాత అదే సంవత్సరంలో తమిళ్ లో దైవ తిరుమగళ్ సినిమాలో న‌టించి మెప్పించింది. ఆ సినిమానే తెలుగులో నాన్న పేరుతో అనువాదం అయింది. ఆ తర్వాత ఒక తమిళ్ సినిమా, హిందీలో స్టాలిన్ రీమేక్ గా వ‌చ్చిన జై హో సినిమాలో నటించింది. 2014 లో శైవం అనే తమిళ సినిమాలో మెర‌సింది. నాన్న సినిమా తర్వాత మళ్లీ అంత ముఖ్యమైన పాత్ర ఉన్న సినిమా శైవం.ఇక ఆ త‌ర్వాత తెలుగులో కూడా అవ‌కాశాలు వ‌చ్చాయి. 2015 లో వ‌చ్చిన దాగుడుమూత దండాకోర్ సినిమాలో కూడా న‌టించింది. ఆ తర్వాత కొన్ని హిందీ, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించింది. హిందీ సినిమాల్లోనూ ఈ చిన్నారి త‌న‌దైన ముద్ర వేసింది.


2019లో వ‌చ్చిన ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా సినిమాలో ……చిన్నప్పటి సోనమ్ కపూర్ పాత్రను పోషించింది. అలాగే సాండ్ కీ ఆంఖ్ చిత్రంలో….. వృద్ధురాలి పాత్రలు పోషించిన తాప్సీ, భూమి పెడ్నేకర్ లకు మనవరాలిగా నటించింది.

ఆ తర్వాత తమిళ్ లో వచ్చిన సిల్లు కరుపట్టి చిత్రంలో నటించింది. ఈ సినిమాలో నాలుగు ప్రేమ కథలు ఉంటాయి. అందులో ఒక ప్రేమకథ, టీనేజ్ లవ్ స్టోరీ. ఆ కథలో హీరోయిన్ గా నటించింది సారానే. అన్న‌ట్టు సారా తండ్రి కూడా ప్ర‌ముఖ న‌టుడే. ఆయ‌న పేరు రాజ్ అర్జున్‌. ఇటీవల ఒక తెలుగు సినిమాలో కూడా చూసాం. డియర్ కామ్రేడ్ సినిమా లో సెకండ్ హాఫ్ లో వచ్చే ఉమెన్ క్రికెట్ టీమ్ సెల‌క్ట‌ర్ పాత్ర పోషించింది ఆయనే.రాజ్ అర్జున్ కూడా ఎన్నో హిందీ , తమిళ చిత్రాల్లో నటించారు. సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లో రాజ్ అర్జున్ చేసిన నటనకు……. ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. తెలుగులో ఆయన మొదటి చిత్రం డియర్ కామ్రేడ్. అలా త‌న అడుగుజాడ‌ల్లోనే బిడ్డ సారా అర్జున్ ను కూడా న‌డిపిస్తున్నాడు స్టార్ విల‌న్ రాజ్ అర్జున్.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad