Home సినిమా దేవరకొండ మూవీలో విలన్ గా బాలీవుడ్ హీరో

దేవరకొండ మూవీలో విలన్ గా బాలీవుడ్ హీరో

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది కానీ.. ఆ టైటిల్ ఫిక్స్ కాదని నిర్మాతలలో ఒకరైన ఛార్మీ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ కిక్ బాక్సర్ గా కనిపించనున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. ఓ డాన్ కు మరియు అతని కొడుకుకి ఏర్పడ్డ సంఘర్షనే ఈ చిత్రం కథాంశం అని ఇన్సైడ్ టాక్

ఇక హీరో తండ్రి మరియు డాన్ పాత్ర కోసం.. దర్శకుడు పూరి జగన్నాథ్.. ఏకంగా రజినీకాంత్ విలన్ నే దించేసాడని సమాచారం. ‘దర్భార్’ సినిమాలో విలన్ గా నటించిన సునీల్ శెట్టి.. విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ లో హీరో తండ్రిగా అలాగే డాన్ గా కనిపిస్తాడట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పదిహేను నిమిషాల ఎపిసోడ్ లో సునీల్ శెట్టి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు కాబట్టే.. బాలీవుడ్ సీనియర్ హీరో అయిన సునీల్ శెట్టిని తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మొదట మణిశర్మ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చే ఉద్దేశంతో దర్శకుడు పూరి మరియు సహా నిర్మాత అయిన కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ‘డియర్ కామ్రేడ్’, ‘నోటా’ వంటి డిజాస్టర్ లతో రేసులో వెనక్కి పడ్డ విజయ్ దేవరకొండ.. ఈసారి సాలిడ్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వస్తాడేమో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad