Home సినిమా ఒక్క టీజర్ ప్లీజ్..మెగా అభిమానుల కోరిక

ఒక్క టీజర్ ప్లీజ్..మెగా అభిమానుల కోరిక

PicsArt 08 03 10.43.28

టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరు సినిమా వస్తుందంటే అభిమానుల కోలాహలం మామూలుగా ఉండదు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, ఈలలు గోలలతో రచ్చ రచ్చగా ఉంటుంది. అందులోని బాస్ పది సంవత్సరాల తర్వాత మళ్లీవెండితెరపై అడుగుపెట్టడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులులేవు. రాజకీయ ప్రస్థానాన్ని ముగించుకొని చిరు మళ్లీ సినిమాల్లో అడుగు పెడుతున్నారని తెలియగానే మెగా అభిమానులు అందరూ బాక్సాఫీస్ రికార్డుల సెట్ చేయడానికి సిద్ధం అయ్యారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డితో మెగాస్టార్ మళ్లీ తన జోరుని చూపించారు. మెగా అభిమానులకి ప్రతి సంవత్సరం రెండు ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. ఒకటి మెగాస్టార్ సినిమా విడుదల కాగా మరొకటి వారి పుట్టిన రోజు. చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 ఆ రోజున మెగా అభిమానులు రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ.

అభిమానుల కోసం చిరు ప్రతి పుట్టిన రోజు నాడు “తను నటించే సినిమాలోని టైటిల్ లేదా టీజర్ ను విడుదల చేయటం” సర్వ సాధారణ విషయం. ప్రస్తుతం మెగా స్టార్ టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ లాంటి డైరెక్టర్ తో చిరు సినిమా అనగానే మెగా అభిమానుల్లో కూడా భారీ బజ్ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే సినిమాను మాస్ ఆడియన్స్ మెచ్చేలా కొరటాల తెరకెక్కిస్తున్నారు. ఇంతవరకు బాగున్నప్పటికీ మెగా అభిమానులు మాత్రం తీవ్రమైన నిరాశ, నిస్పృహలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకానొక సందర్భంలో కొరటాలశివ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా జరిగాయి. దీనికి ప్రధాన కారణం చిరు – కొరటాల నుండి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ రాకపోవడమే.

ఈ నెల ఆగస్టు 22 చిరు పుట్టినరోజు రావడంతో సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని మెగా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ గాని టీజర్ గాని రావడం లేదని తెలుస్తోంది.మెగా అభిమానులు మాత్రం కనీసం చేయాలని కోరుకుంటున్నారు. కానీ కొరటాల నుండి ఎటువంటి పాజిటివ్ రియాక్షన్ రాకపోవడంతో చిరు అభిమానులు ఏం చేయాలో తోచడం లేదు. ఫైనల్ గా ఆగస్టు 22న అద్భుతం జరిగితే గానీ టీజర్ విడుదలయ్యే అవకాశం లేదు .దీనిపై మెగా అభిమానులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad