నలుగురు ఎంపీలు టీడీపీని వీడటంపై ఆ పార్టీ కీలక నేత వర్ల రామయ్య స్పందించారు. టీడీపీకి మరో ఝలక్ అంటూ సోషల్ మీడియాలు కథనాలు వస్తున్నాయని, తమ పార్టీని వీడిన నలుగురు ఎంపీలు కూడా కేసులకు భయపడి తీహార్ జైలుకు పంపుతారేమోనన్న భయంతో బీజేపీలో చేరారని అన్నారు.
తీహార్ జైలుకు వెళ్లేవారిని, కేసులు ఉన్న వారిని ఇన్ని రోజులు టీడీపీ భరించిందా..? అన్న మీడదియా ప్రతినిధి ప్రశ్నకు వర్ల రామయ్య సమాధానమిస్తూ తప్పక భరించాల్సి వచ్చిందన్నారు. ఆ నలుగురు టీడీపీ ఎంపీలు వెళ్లిపోతారన్న విషయం తమకు ముందే తెలుసని, చంద్రబాబు దేశంలో లేనప్పుడు ఇటువంటి దొంగదెబ్బ కొట్టడం సరైన పద్ధతి కాదన్నారు.