పదవులు శాశ్వతం కాదు.. ప్రజలకు చేసిన అభివృద్ధే మిగులుతుందని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ సమస్యలే లేకుండా చేసిందని, సీఎం కేసీఆర్ నిత్య కృషి కారణంగానే రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. పదువులు ఉన్నా.. లేకున్నా తాను మాత్రం ప్రజల మధ్యనే ఉంటానని స్పష్టం చేశారు.
పదువులు అందరికీ వస్తుంటాయ్.. పోతుంటాయ్.. కానీ ఎంత హుందాగా.. ఎంత గొప్పగా ప్రజా సమస్యలను పరిష్కరించామన్నదే ముఖ్యమైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. జీవితంలో అలాంటి మంచి తీపి జ్ఞాపకాలే మిగులుతాయన్నారు. పదవులు అశాశ్వతమని, కానీ పదవీకాలంలో ఉన్నప్పుడు చేసే మంచి పనులే శాశ్వతంగా మిగులుతాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.