ఏపీ టీడీపీకి మరో షాక్ తగలనుందా..? అన్న ప్రశ్నకు రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. గురువారం నలుగురు రాజ్యసభ ఎంపీ టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగని వారు టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలంటూ లేఖను కూడా సమర్పించారు. ఆ ప్రక్రియను రాజ్యసభ చైర్మన్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి షాక్ ఇవ్వనున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం నార్త్ విశాఖ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు మరో 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని వీడే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.