లే.. లే.. లేదు.. నా సంగతి మీకు తెలీదు.. నేను చెప్పిన మాట తప్పే మనిషిని కాదు.. నేను చెప్పినట్టు జరగకుండా ఉంటే కచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ భూమా అఖిల ప్రియ చెప్పిన మాట ఏమిటి..? అది జరగకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఆమె చెప్పిన మాటలు నమ్మశక్యమేనా..? ఇంతకీ ఏ సందర్భంలో అఖిలప్రియ అలా చెప్పాల్సి వచ్చింది..? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేముందు ఈ మేటర్ కచ్చితంగా చదవాల్సిందే మరీ..!
కాగా, భూమా అఖిలప్రియ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మొట్టమొదటిగా మీడియా ముందుకొచ్చిన అఖిలప్రియ ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇంటర్వ్యూలో భాగంగా దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సంబంధించిన పలు ప్రశ్నలు భూమా అఖిల ప్రియకు ఎదురయ్యాయి. ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న భూమానాగిరెడ్డి, ఆపై కేసుల ఉన్న నేపథ్యంలో అతి ఒత్తిడితో టీడీపీలోకి వెళ్లారని, అక్కడ్నుంచి వచ్చిన నోట్ల కట్టలతో ఆ అప్పులన్నీ తీర్చేసి ఫ్రీ అయ్యారు..! నిజమేనా..? అన్న ప్రశ్నకు అఖిలప్రియ సమాధానమిచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లాక తాము కొత్తగా కొన్న ఆస్తులు ఏమిటో చూపించండి అంటూ ఎదురు ప్రశ్నించారు.
అలాగే టీడీపీ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన నీరు – చెట్టు కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అఖిలప్రియ చేసినంత అవినీతి ఎవ్వరూ చేయలేదు అన్న ప్రశ్నకు ఏం అవినీతి చేశామో నిరూపించాలంటూ అఖిల ప్రియ ఛాలెంజ్ విసిరారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో తన శాఖలో ఎటువంటి అవినీతి జరగలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తాము అంత అవినీతి, అక్రమాలు చేసి ఉంటే వచ్చే ఎన్నికల్లో చూసుకుందామని, ఒక వేళ ఆ ఎన్నికల్లో గెలకుంటే రాజకీయ సన్యాసానికి తానను సిద్ధమని సవాల్ విసిరారు.