
ఉపవాసం అనేది దైవాన్ని నమ్ముకుని చేస్తుంటాం. ఉపవాసం రోజు పాటించాల్సిన నియమాలు…ఏంటి అంటే…దైవానికి సమీపంలోనే మనం గడుపుతాం కాబట్టి భోజనం ఉండదు. ప్రసాదం మాత్రం స్వకరస్తాము. ఉండలేని వాళ్లు ఫలహారం తీసుకుంటారు. ఏకాదశి నాడు శ్రీరామనవిమి , శివరాత్రి రోజున పూర్ణాపవాసం చేయాలి. అంటే రోజంతా భోజనం చేయకుండా తర్వాత రోజు చేయాలి. అలానే కార్తీక మాసంలో పగలు భోజంన చేయం, రాత్రి భోజనం చేస్తుంటాం. ఏదైనా దైవానికి సంబంధించిన నిర్ణయించుకున్నప్పుడు మంగళవారం రోజున ఆంజనేయుడికి, శనివారం రోజున వెంకటేశ్వరుడికి , అమ్మవారంకోసం శుక్రవారం పెట్టుకున్నప్పుడు, సుబ్రహ్మణ్య స్వామి కోసం మంగళవారమని….పరమశివుడి కోసం సోమవారం అని…..సూర్యభగవానుడికి ఆదివారం ఇలా ఆయా పర్వదినాల్లో దైవ కార్యక్రమాలకు సంబంధించినవి కాకుండా ప్రతీ వారం కూడా ఆయా వారాల్లో ఉపవాసం చేసేప్పుడు ఒక్క పూట మాత్రమే ఉంటుంది.
పగలు భోజనం తీసుకోవడం, రాత్రి పూట భోజనం తీసుకోకుండా ఉపహారం ఉంటుంది. కార్తీక మాసంలో చేసే ఉపవాసాన్ని నక్తం అంటారు. పగలు భోజనం చేయం రాత్రి పూట భోజనం చేస్తాం. అది మళ్ళీ రెండు రకాలు. ఛాయ నక్తం అని ..నక్తం అని…ఛాయా నక్తం అంటే ఏమిటంటే నీడ మనకు రెట్టింపు పడేదాకా ఉండి…సుమారు ఐదు ఐదున్నర దాకా ఉండి భోజనం చేస్తే ఛాయా నక్తం అంటాం. నక్షత్రాలు వచ్చాక భోజనం చేస్తే దాన్ని నక్తం అంటారు. ఈ ఉపవాస సమయాల్లో భోజనం చేయలేని కారణంగా దాని రెట్టింపు పండ్లో ఫలహారాలు చేస్తే…ఈ ఉపవాసానికి ప్రయోజనం ఉండదు. అందుకే తక్కువగా తినాలి. ఏకాదశి ఉపవాసం చేస్తున్నాముంటే ఆ ఏకాదశి రోజున భోజనం చేయకపోవడం వల్ల మనకు దైహిక మైన ప్రయోజనాలు కూడా ఉంటాయి.
శారీరకమైన ఆరోగ్య ప్రయోజనాలుక కూడా ఉంటాయి. ఉపవాసంపేరుతో ఇష్టొమచ్చినట్టు తింటే ఉపవాస ఫలితం ఉండదు. మనకు జఠర దీప్తి అంటే జఠరాగ్ని ఉంటేనే బాగా అరిగి ఆరోగ్యంగా ఉంటాం. ఎక్కువ అనారోగ్యంగా ఉండటానికి కారణం జఠరదీప్తి లేకపోవడం, ఆకలి మందగించడం, దాని వల్ల తిన్న పదార్ధం అంతా కూడా విషపూరితమైపోయి….దాని వల్ల తిన్న పదార్ధాలన్నీ విషపూరితం అయ్యి రోగాలు వస్తాయి. అన్నానికి రెండు అర్ధాలు ఉన్నాయి. అదభక్షణి . అన్నం అంటే భక్షించేది. మనం భక్షించేంది అక్రమంగా తింటే అది మనల్ని భక్షిస్తుంది. అందువలవ్ల ఉపవాసాలు జాగ్రత్తగా పాటిస్తుంటే చాలా మంచి చేస్తాయి. నియమాలను సక్రమంగా పాటిస్తే మంచి జరుగుతుంది. భౌతికంగా, ఆధ్యాత్మికంగా , శారీరకంగా ప్రయోజనం ఉంటుంది. అలాకాకపోతే అన్నింటికి చెడతాం.