
మనలో చాలా మంది సిరిసంపదల కోసం పరితపిస్తుంటాం. అందుకోసం రోజూ కష్టపడుతుంటాం. కొందరైతే కాసుల తల్లి కటాక్షం తమపై ఉండాలని ఏకంగా పూజాధి కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఈ వీడియోలో అసలు ఉదయం నిద్రలేవగానే ఏ పని చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అనేది తెలుసుకుందాం.
చాలా మంది ఈ రోజును ఎలా ప్రారంభిస్తే మంచి జరుగుతుంది అని అనకుంటుంటారు. అందుకోసం రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు నిద్రలేవగానే అరచేతిని చూసుకుంటారు. మరికొందరు దేవుడ్ని చూసుకుంటారు. మరికొందరు తల్లిదండ్రుల ఫోటోలుగానీ, లేదంటే వారినే చూడాలనుకుంటారు. అసలు ఉదయం నిద్రలేవగానే ఏ పని చేస్తే…… పనిలో విజయం సాధించి అష్ట ఐశ్యర్యాలు తులతూగుతాయో చూద్దాం. ప్రతీ రోజూ ఈ విధంగా ప్రారంభిస్తే ప్రతీ పనిలో మీరు విజయం సాధించడం ఖాయమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకోసం ఏం చేయాలంటే…..
ప్రతీరో్జూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మీ తల వద్ద రాగి చెంబును పెట్టుకోండి. ఆ రాగి చెంబులో నీటిని తీసుకుని ఏడు చుక్కల తేనెను వేయండి. అదే విధంగా అసలు ఉపయోగించని బంగారపు వస్తువును ఏదైనా ఈ రాగి చెంబులోని నీటిలో వేయండి. వెంటనే మూత పెట్టేయండి. ఆ మూత కూడా కచ్చితంగా రాగిదై ఉండాలి. ఆ తర్వాత మీరు ఎక్కడైతే నిద్ర పోతారో అక్కడ తలకు కుడివైపున పెట్టుకోవాలి. అలా ఈ చెంబును తల దగ్గర పెట్టుకుని నిద్రపోవాలి. ఉదయం నిద్రలేవగానే అమ్మానాన్న ల ఫోటోగానీ లేదంటే వాళ్లనే గానీ చూడాలి. ఆ తర్వాత భూదేవికి నమస్కరించాలి. అనంతరం ఆ నీటిలో నుంచి బంగారపు వస్తువును పక్కన పెట్టి ……నీటిని తాగాలి. అన్నట్టు బ్రెష్ చేయకుండానే నీటిని తాగితే మంచిది . అలా తాగిన తర్వాత మీ దినచర్యను ప్రారంభించండి.

ఈ ప్రక్రియ చేయడం ద్వారా చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. కుజదోషాలు, కాల సర్పదోషాలు , శని ప్రభావాలు తొలిగిపోతాయి. ప్రతీ పనిలో విజయం లభిస్తుంది. తద్వారా అఖండ ఐశ్యర్యం మీ సొంతం అవుతుంది. ఇది శాస్త్రాల్లో చెప్పబడిన ఓ చక్కని పరిష్కారం. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు… ప్రతీ రోజూ నిద్రలేవగానే ఈ చిన్న పని చేస్తే అంతులేని ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. మూఢనమ్మకమని కొట్టిపారేయకుండా….చిన్న పరిష్కారాన్ని చేసి చూడండి. ఫలితాలు వస్తే ఫాలో అవుతారు లేదంటే పక్కన పెట్టేస్తారు అంతేకాదు. మనం ఎంత కష్టపడినా దానికి ఇసుమంతా అదృష్టం లేకపోతే ……మన ప్రయత్నాలన్నీ వృధానేనని మన పెద్దలు చెబుతుంటారు. అలా కలిసి వస్తేనే కోటీశ్వరులు అవుతారని…అఖండ విజయం, ఐశ్వర్యం ప్రాపిస్తుందని అంటుంటారు. అయితే ఇలా జరగాలంటే కొన్ని మంచి పనుల చేయడం వల్లే సాధ్యమౌతుంది.

ఉదయం నిద్ర లేవగానే ఈ మూడు మంత్రాలను మూడు సార్లు జపిస్తే మంచి జరుగుతుందట. అవేంటో తెలుసుకునే ముందు పురాణ సారాంశంలోని ఒక భాగాన్ని ఒక్కసారి తెలుసుకోవాలి. బ్రహ్మరాసిన రాత ఎలాంటిది అయినా సరే మనం కొన్ని మంచి పద్ధతులు పాటిస్తే అది ఎంతో అదృష్టాన్ని, మంచి తేజస్సుని , విజయం సాధించే సంకల్పాన్ని,పట్టుదలను మనకు ఇస్తాయి. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయేది అలాంటిదే…… అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఉదయం నిద్రలేవగానే ఇలా చేస్తే ఆ రోజంతా ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. ఉదయం లేవగానే ఓం నమో నారాయణాయ నమహా అనే మంత్రం మూడు సార్లు జపించాలి అలా అని మన రోజుని ఆరంభిస్తే ఆ రోజంతా ఏ పని తలపెట్టినా అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని నమ్మకం. ఇక మరో మంత్రం ఉంది. అది గానీ జపించి రోజును ప్రారంభిస్తే ధన లాభం కలుగుతుంది. భూలాభం వస్తుంది. నిద్ర లేవగానే ఓం నమో లక్ష్మీనారాయణాయనమహా అనే మంత్రం మూడు సార్లు జపిస్తే చాలు…. మనకి ఉన్న అప్పుల బాధలు, డబ్బు సమస్యలు పోతాయి. ఇంట్లో దారిద్రయం పూర్తిగా వదిలి వెళ్లిపోతుంది.
ఇక మరో మంత్రం ఉంది. దీన్ని కాని పటిస్తే ఇంట్లో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ మోక్షం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటి అంటే…హరే రామ హరే రామ రామ రామ హరే హరే …హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఈ మంత్రాన్ని మూడు సార్లు జపించాలి. ఇలా జపించి రోజును మొదలుపెడితే ఇంట్లో మోక్షం ప్రాప్తిస్తుంది. అలాగే ఇంట్లో ఉండే కుటుంబ బాధలు, ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. సో కాబట్టి ప్రతీఒక్కరూ ఈ మూడు మంత్రాలను జపిస్తూ రోజును ప్రారంభిస్తే మంచి జరుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మూఢనమ్మకమని కొట్టి పారేయడం కంటే….ఒక్కసారి ఆచరిస్తే దాని ఫలితమేంటో తెలుస్తుంది. అప్పుడే కదా మనం నమ్మాలా వద్దా అనేది కూడా బోధపడుతుంది. కావును మీరు కూడా ఈ మూడు మంత్రాలను రోజూ మూడు సార్లు జపించి మహాలక్ష్మీ కృపకు పాత్రులవ్వండి.