Home భక్తి కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్లితే ఏమౌతుంది...పువ్వు వస్తే ఏం జరుగుతుంది...

కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్లితే ఏమౌతుంది…పువ్వు వస్తే ఏం జరుగుతుంది…

Coconut Breaking

దేవునికి స‌మ‌ర్పించే నైవేద్యాల్లో కొబ్బ‌రికాయ‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. దేవునికి ర‌క‌ర‌కాల పిండి వంట‌లు చేసి దేవునికి స‌మ‌ర్పిస్తే ఎంత పుణ్య‌మొస్తుందో….ఒక కొబ్బ‌రికాయ‌ను కొడితే కూడా  అంతే స్థాయిలో ఫ‌ల‌మొస్తుంది. అయితే  కొబ్బ‌రికాయ కొట్టిన‌ప్పుడు కొన్ని సార్లు ఊహించ‌ని ప‌రిణామాలు జ‌రుగుతుంటాయి. కొబ్బ‌రికాయ కుళ్లిపోవ‌డం లేదంటే కాయ‌లో పువ్వు రావ‌డం ఇలా జ‌రుగుతూ ఉంటుంది. అలా కొబ్బ‌రికాయ ప‌గిలిన విధానాన్ని బ‌ట్టి కూడా ఎన్నో అర్ధాలు ఉన్నాయి.  వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌లో ర‌క‌ర‌కాల భావ‌న‌లు ఉంటాయి. ఏదో అయిపోతుంద‌ని ఫీల‌వుతుంటారు.  కొబ్బరికాయ‌ను దేవుడికి  నైవే‌ధ్యంగా స‌‌మ‌ర్పించ‌డం వెనుక ఎంతో అంత‌రార్ధం ఉంది. కొబ్బ‌రికాయ‌ను ప‌గ‌ల‌కొట్ట‌డం అంటే …..మ‌న‌లోని ద్వేషాన్ని అసూయ‌ను బ‌ద్ధ‌ల‌కొట్ట‌డ‌మేన‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే గుడిలో కానీ లేదా ఇంటి ద‌గ్గ‌ర కానీ కొబ్బ‌రి కాయ కొట్టే ముందు దాన్ని ప‌రిశుభ్రంగా క‌డ‌గాలి. 

కొబ్బ‌రికాయ ప‌గ‌ల కొట్టిన‌ప్పుడు ఆ కొబ్బ‌రికాయ అడ్డంగా ప‌గిలి స‌మానంగా ఎలాంటి వంక‌రులు లేకుండా ఉంటే…..మీరు అనుకున్న ప‌నుల్లో విజ‌యం సాధిస్తారు.  అలానే మీ మ‌న‌సులో  కోరుకున్న ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన కోరిక….  త్వ‌ర‌లోనే తీరు‌తుంద‌ని సంకేతం. అలానే కొబ్బ‌రికాయ కొట్టిన‌ప్పుడు ఒక్కోసారి స‌మానంగా , నిలువుగా ప‌గులుతూ ఉంటుంది. ఇలా ప‌గిలినా  మంచిదే.  ఎలాంటి వంక‌లు లేకుండా నిలువునా కొబ్బ‌రికాయ ప‌గిలితే …..ఆ ఇంటి కోడ‌లు కానీ, కూతురు కానీ త్వ‌ర‌లోనే సంతానాన్ని పొందుతార‌ని అర్ధం.  అలాగే కొబ్బ‌రికాయ కొట్టిన‌ప్పుడు వంక‌ర‌టింక‌ర‌గా ప‌గిలితే …..దానికి మొద‌టి కార‌ణం కొబ్బ‌రికాయ కొట్టేవారికి దానిని   కొట్ట‌డం రాదేమో అని అర్ధం. లేదంటే అత‌ని మ‌న‌సు నిల‌క‌డ‌గా లేక‌పోవ‌డం కార‌ణ‌మై ఉండొచ్చు. అలాగే ఒకోసారి కొబ్బ‌రికాయ‌లో పువ్వు వ‌స్తుంటుంది. పువ్వు రావ‌డం అనేది చాలా మంచిది.

అలాగే కొత్త‌గా పెళ్లైన జంట‌కు కొబ్బ‌రికాయ కొట్టిన‌ప్పుడు…. కొబ్బ‌రికాయ‌లో పువ్వు వ‌స్తే ఆ జంట త్వ‌ర‌లోనే సంతానం పొందుతారు అని అర్ధం. ఒకోసారి కొబ్బ‌రికాయ కొట్టిన‌ప్పుడు అది కుళ్లుపోతూ ఉంటుంది.  కొబ్బ‌రికాయ కుళ్లినప్పుడు అశుభం అని,  చాలా దోష‌మ‌ని భావిస్తుంటారు. చాలా భ‌య‌ప‌డిపోతుంటారు. కానీ అలాంటి భ‌యాందోళ‌న‌లు ఏమీ అక్క‌ర్లేదు.  పూజ‌లో కొబ్బ‌రికాయ కుళ్లినా ఎలాంటి దోషాలు లేవ‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. కొబ్బ‌రి కాయ కుళ్ల‌డం అనేది స‌హ‌జం. ఒక వేళ పూజా స‌మ‌యంలో కొబ్బ‌రికాయ కుళ్లితే ఆ కుళ్లిన కాయ‌ను వెంట‌నే ప‌డ‌వేయాలి. వెంట‌నే కాళ్లు , చేతులు, ముఖం క‌డుక్కుని మ‌రోక కొబ్బ‌రికాయ‌ను నైవేద్యం స‌మ‌ర్పిస్తే స‌రిపోతుంది. కొత్త వాహ‌నాలకు  మంచి చేసే స‌మ‌యంలో …..కొబ్బ‌రికాయ‌లు కుళ్లి  పోతుంటాయి. అప్పుడు ఎంతో అన‌ర్ధ‌మ‌ని భావిస్తుంటారు.

కానీ ఎలాంటి చెడు జ‌ర‌గ‌దు. వాహ‌నాల‌కు మంచి చేసే స‌మ‌యంలో ఒక వేళ కొబ్బ‌రికాయ కుళ్లితే …..ఆ వాహ‌నం మ‌రోక సారి శుభ్ర‌ప‌రిచి వాహ‌నానికి పూజ చేస్తే స‌రిపోతుంది. ఇక  పండు గానీ, పుష్పం కానీ….. ఇలా ఏదైనా మ‌నస్పూర్తిగా స‌మ‌ర్పిస్తే భ‌గ‌వంతుడు స్వీక‌రిస్తాడు. కాబ‌ట్టి కొబ్బ‌రికాయ కుళ్లితే… దోష‌మ‌ని అరిష్ట‌మ‌ని అస‌లు భావించ‌కండి. ప్ర‌తీదానికి ప‌రిష్కారం ఉంటుంది అనే విష‌యాన్ని మర‌వ‌ద్దు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad