Home ట్రెండ్స్ ఆత్మహత్య ఆలోచనలు వచ్చే వారు… పౌర్ణమి నాడు ఇలా చేయాలి!

ఆత్మహత్య ఆలోచనలు వచ్చే వారు… పౌర్ణమి నాడు ఇలా చేయాలి!

Suicide thoughts
Shadow of sad man hanging suicide. light and shadow

మనిషి అంటే రెండు కాళ్లు, రెండు కళ్లు, రెండు చేతులు వంటి వివిధ అంగాల సమాహారమేనా? ఖచ్చితంగా కాదు! మనిషంటే…. ఆలోచనలు! ఆ ఆలోచనలకు మూలమైన మనస్సు! మనస్సే మనిషిని తయారు చేస్తుంది. అలాగే, అదే మనిషిని నీర్వీర్యం కూడా చేస్తుంది. ఒకరు విజయాలతో దూసుకుపోవటానికి, మరొకరు ఎప్పుడూ నిరాశ, నిస్పృహలతో అపజయాల పాలుకావటానికి … మనస్సే కారణం! మరి మనస్సుకి ఎవరు కారణం? జ్యోతిష్యం ఏం చెబుతోంది? మన పెద్దలు జాతక చక్రంలో చోటిచ్చిన నవ గ్రహాల్లో ఒక్కో గ్రహం ఒక్కో దానికి కారణం.

అలా మనస్సుకి కారణమైన వాడు… చంద్రుడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జాతకంలో చంద్రుడు బలహీనంగా వుంటాడో… అప్పుడే అతడి మనస్సు కూడా బలహీనమవుతుంది. రాశీ చక్రంలో పాప స్థానాల్లో చంద్రుడు వున్నా… పుట్టినప్పుడు అమావాస్య దరిదాపుల్లో వున్నా… ఆకాశంలో చంద్ర బింబం అసలు కనిపించని స్థితి వున్నా… అలాంటి వారు మానసికంగా బలహీనంగా వుంటారు. కొందరైతే మానసిక స్థిమితం లేక పిచ్చివారుగా కూడా ప్రవర్తిస్తుంటారు. అయితే, పైకి పిచ్చివారిగా  కనిపించని వారు సైతం లోలోన చాలా రకాల మానసిక బాధలతో సతమతం అవుతుంటారు. పదే పదే ఆత్మహత్య చేసుకోవాలనిపించటం చాలా మందిలో కనిపిస్తుంటుంది. ఇది ప్రమాదకరం. చంద్రుడే దీనికంతటికీ కారణం!

hanging getty 1

జాతకంలో చంద్రుడు బాగోలేక మానసిక సమస్యలు తలెత్తితే ఏంటి పరిష్కారం? ఆత్మహత్య ఆలోచనల్లాంటివి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఎలా? ఈ ప్రశ్నలకి జవాబు… అమ్మవార్ని పూజించటం. చంద్ర గ్రహానికి అధిదేవత గౌరీ దేవి. అందుకే అమ్మవార్ని ఎంతగా పూజిస్తే అంతగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. శివ, పార్వతులు ఇద్దర్నీ సేవిస్తే మరింత శుభం! అయితే, మానసిక అస్థిరత్వం పోవటానికి, ఉన్మాదం లాంటివి వుంటే శాంతించటానికి… కొన్ని తంత్రాలు వున్నాయి. వాట్ని పాటిస్తే క్రమంగా మార్పు కనిపించే అవకాశాలు వున్నాయి.

మానసిక సమస్య వున్న వార్ని పౌర్ణమి నాటి రాత్రి వేళ…. అంటే, పది, పదకొండు గంటల సమయంలో … నిండు చంద్రుడి వెన్నెల పడేలా కూర్చోబెట్టాలి. వారి చుట్టూ గ్లాసులో పాలు వుంచి తిప్పాలి. ఆ పాలలోనే ఒక చుక్క తేనే, కొద్దిగా కుంకుమ పువ్వు వేయాలి. ఈ మిశ్రమాన్ని చంద్రదోషం వున్న వారి చుట్టూ తిప్పి ఏదైనా చెట్టు మొదళ్లలో పోయాలి. ఇలా చేస్తే చంద్రదోషం తొలగి మానసిక స్థైర్యం, స్థిరత్వం చేకూరుతాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad