
మనలో చాలా మంది నరఘోర గురించి విని ఉంటాం. మకు నరఘోర తగిలిందని…దృష్టి దోషం తాకిందని….అందుకే మా వ్యాపారం పోయిందని….మా కుటుంబంలో అశాంతి నెలకొనిందని చెబుతుంటారు. నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందట. నల్లరాయి అంటే గ్రానైట్ . అంటే గ్రానైట్ అయినా మనిషి అసూయతో చూస్తే పగలిపోతుందని అర్ధం. దీనికి పురాణాల్లో ఉదాహరణ కూడా ఉంది. రామాయణంలో సీతాదేవి నాకు కళ్లు నొప్పిగా ఉందని రామునికి చెబుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న రాక్షసుల్ని చూసి ఆ మాట అంటోంది. చుట్టూ ఉన్నా వికృతమైన రూపాలను చూసి కళ్లు నొప్పి పెడుతన్నాయని సీతాదేవి చెబుతోంది. అంటే చూపుకు కూడా కష్టపడటం, కష్టపెట్టడం అనేవి రెండూ ఉంటాయి.
మరో ఉదాహరణ ఏంటి అంటే….చక్కగా ఉన్న పిల్లలను పది మందిలోకి తీసుకెళ్తే హఠాత్తుగా గుక్క పెట్టి ఏడుస్తుంటారు. ఆ గుక్క పెట్టి ఏడుస్తున్న పిల్లల్నీ లోపలికి తీసుకొచ్చి నాలుగు ఉప్పురాళ్లతో ……దిష్టి తీసి పక్కన పెట్టగానే వెంటనే ఏడుపు మానేసి హాయిగా నవ్వుకుంటారు. దీని వెనుక ఏదైనా శాస్త్రీయత ఉందా అంటే లేదు. ఇదంతా మూఢనమ్మకమా…దీని వెనుకలా ఏదైనా నమ్మదగిన ఆధారం ఉందా అనే అనుమానాలు కూడా ఉంటాయి. నిజానికి ఆధారం ఉంది అనే పాశ్చాత్య దేశాల్లో చేసిన పరిశోధనలు చెబుతున్నాయి. మన దేశంలో చేస్తే మనం నమ్మం. అయినా సరే పరిశోధనలుగా కాకుండా నమ్మకాలుగా చెబుతుంటారు. ప్రాణిక్ హీలింగ్ లాంటి ప్రత్యేకమమైన చికిత్స పద్ధతులు ఉన్నాయి. వాళ్లు ఏం చేస్తారంటే …..చేతిలో రాళ్లు ఉప్పే తీసుకుంటారు. అయోడైజ్డ్ ఉప్పు తీసుకోరు.
దానిని అసలు తీసుకోకూడదు. ఆరోగ్యంగా ఉండాలంటే అయోడైజ్డ్ ఉప్పును వాడటం ఆపేస్తేనే మంచిది. బీపీలు రావడానికి కూడా అలాంటి ఉప్పే కారణమనే ఇటీవల పరిశోధనలు తేల్చాయి. కనక ఇంత రాళ్లు ఉప్పు తీసుకోని వాళ్లు చుట్టు ప్రదిక్షణ దిశగా తిప్పి ఆ తర్వాత దానిని నేల మీద తిప్పికొట్టి ……నీళ్లలో పడేస్తే ఆ పిల్లలకు తగిలిన దిష్టి తగలకుండా ఉంటుంది. ప్రాణ చికిత్స విధానంలోనూ చెప్పేది ఇదే.
మానవశరీరంలో నూటికి 70 శాతం పైన నీళ్లే ఉన్నా…… ఉన్నటువంటి లవణాల్లో ప్రధానంగా ఉన్నది ఏమిటి అంటే ఉప్పు. దీన్నే మనం శాస్త్రీయంగా సోడియం క్లోరైడ్ అని పిలుస్తుంటాం. దీనికి వాతావరణంలో ఉండే శక్తిని గ్రహించే సామర్ధ్యం ఉంది. అది పాజిటివ్ కావచ్చు. నెగిటివ్ కావొచ్చు. మనకు అధికంగా ప్రతీకూలమైన శక్తి ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు దీన్ని ప్రదిక్షణ దిశగా తిప్పినప్పుడు….ప్రతీమనిషికి జీవసంబంధమైన అయస్కాంత ఆవరణ ఉంటుంది.
దాని వర్ఛస్సు అని సంస్కృతం , తెలుగులో పిలుస్తుంటాం . దాన్ని ఇంగ్లీష్ లో హాలో అంటాం. అంటే దేవతల బొమ్మలు వేసేప్పుడు చుట్టూ ఒక తెల్లటి వెలుగుచక్రం ఉండేలా వేస్తుంటారు. అయితే అది మామూల కంటికి కనిపించదు. ఏ రకంగా అయితే మాగ్నటిజమ్, విద్యుత్ ను చూడలేమో….మనిషి చుట్టు ఉండే వర్చస్సును కూడా చూడటం కష్టం. విద్యుత్ ను , అయస్కాంతం ఉందని గుర్తించే పరికరాలు ఉన్నట్టే….ఈ బయోమాగ్నటిక్ ఫీల్డ్ ను గుర్తించే పరికరాలు, సాధనాలు , పద్ధతులు ఉన్నాయి.
దానిలో ప్రతికూలమైన భావన ఏదైతే ఉందో దాన్ని ఉప్పుతో …..ఇలా అనేగానే తీసేయడం జరుగుతుంది. దాంతో వాళ్లకు తేలికై ఒంటి మీద చెమటను తుడిచిస్తే ఎంత హాయిగా ఉంటుందో …….అంత తేలిగ్గా ప్రతీకూల శక్తులను తీసేయడం జరుగుతుంది.
ఇది చిన్నపిల్లల విషయంలో ప్రత్యక్షంగా మనం ఏదైతే మనం పరిశీలిస్తామో ……అలానే పెద్ద పెద్ద సంస్థలు కావొచ్చు, ఇల్లు కావచ్చు…కుటుంబాలు కావొచ్చు. వాటికి కూడా నరుడి దృష్టి వల్లే ఇలా జరుగుతుంది. ఫలితం అయితే అర్ధమౌతుంది. దానికి కారణం కూడా చెప్పాలి కదా. చూపుకు నిజానికి చాలా శక్తి ఉంది. దేన్నినైనా మనం కేంద్రీకరించి చూడటం వల్ల ….తలనొప్పి వస్తుంది. చిన్నప్పుడు పిల్లలు కూడా ఇలానే చేస్తుంటారు. చూపుకు ఉన్న శక్తి వల్లే ఇలా జరుగుతుంది. కావాలని చేయకపోయినా….కొంత మంది చూపులో మనోభావాలు వ్యక్తమౌతుంటాయి. మనసులో ఉన్న అసూయ, ద్వేషం మొదలైన ప్రతీకూల భావనలు …..చూపుల ద్వారా వ్యక్తమయ్యి అవతలి వాళ్లను ప్రభావితం చేస్తాయి. ఇది వాస్తవంగా జరిగేవిషయం. దీన్ని అడ్డం పెట్టుకుని…ప్రతీదానికి మాకు దిష్టి తగిలిందని అంటుంటారు. తప్పులు చేసింది వాళ్లు…కానీ ఏదైనా నష్టం జరిగితే వాళ్లెవరూ దిష్టి పెట్టారని సర్దిజెప్పుకుంటుంటాం. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటే….ఎందువల్ల దృష్టి దోషం తగిలింది….. దాన్ని ఎలా తొలగించుకోవచ్చు…దానికి పరిహారం ఏంటి అనేది చూసుకోవచ్చు. వీటికి మంత్రాలు, తంత్రాలు అవసరం లేదు. మామూలు క్రియల వల్ల తొలగించుకుని స్వల్పమైన విషయాలు మాత్రమే.