
జీవితంలో కష్టాలు ఎదురవుతున్న సమయంలో కొందరు సంకట చతుర్ధి వ్రతం చేస్తుంటారు. అది ఎలా చేయాలి..ఎప్పుడు చేయాలి…ఎలా ఆచరించాలి అనేదాని గురించి మనం తెలుసుకుందాం. నిజానికి దానిని సంకట చతుర్ది వ్రతం అని అనకూడదు. దాని పేరు సంకష్టహర చతుర్ధి. అంటే మనకొచ్చిన కష్టాలన్నింటినీ పొగొట్టే చతుర్ది అని అర్ధం. ఏవైనా ఇబ్బందులు, కష్టాలు , సమస్యలు ఉన్నట్టు అయితే …….ఈ వృతాన్ని ఆచరిస్తే అవి పోతాయట. ఇక ఈ వృతాన్ని ఎప్పుడు ఆచరిస్తారు అంటే….కృష్ణ పక్షంలో ఉండే చవితినాడు మాత్రమే దీన్ని ఆచరించాలి. ఇది కూడా సంధ్య సమయానికి చవితి తిధి ఉండేలా చూసుకోవాలి. దీనికి పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే…ముందుగా ఉపవాసం ఉండాలి . ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా పాలు , పండ్లు మాత్రమే తీసుకోవాలి.
సాయంత్రం సమయానికి కల్లా కుడుములు, ఉండ్రాళ్లు తయారు చేసి గరిక తెచ్చి శాస్త్రోక్తంగా వినాయకుడి పూజ చేయాలి. పూజ చేసేప్పుడు మామూలుగా వినాయకుడు అని అనకుండా…… సంకష్టహర వినాయకా అని పటిస్తే మంచిది. అంటే మనకొచ్చే కష్టాలన్నింటినీ పోగొట్టే వినాయకుడు అని అర్ధం. అంటే ఆయనకున్న బిరుదునే మనం పటిస్తున్నామని భావనను మనం కల్పించాలి. ఆ తర్వాత ఆయనకున్న 21 నామాలు, అష్టోత్తరంతో పూజ చేసి…. ఉండ్రాళ్లు, నివేదన చేసి అప్పుడు భోజనం చేయాలి. అన్నట్టు ఒక కీలక మైన విషయం సూర్యోస్తమయ సమయానికి పూజ మొదలుపెట్టాలి. ఉండ్రాళ్లు కొంచెం ముందు చేసుకోవచ్చు. అంతేకాకుండా చిన్నపిల్లలను పది పన్నెండెళ్లు లోపు ఉన్న మగపిల్లలను పిలచి……. భోజనం పెట్టాలి లేదంటే నాలుగు ఉండ్రాళ్లు అయిన చేతిలో పెట్టాలి.
ఈ విధంగా 21 నెలలు చేయాలి. అంటే దాదాపు రెండేళ్లు. లేదంటే మనం మధ్యలో ఏది సంకల్పం చెప్పుకున్నామో….. అదే పోయేంత వరకు అయినా చేయాలి. దీనికి ప్రత్యేకంగా ఉద్యాపనం అంటూ ఏమీ లేదు. అయితే అనుకున్న వారాలు అయిన తర్వాత గణపతి స్వరూపంగా ఒక చిన్నపిల్లవాడిని పిలవాలి. లేదంటే వీలైతే ఒడుగైన వటువును పిలిచి భోజనం పెట్టాలి . అనంతరం అతనికి అంగొస్త్రం పంచె ఇవ్వాలి. అంటే ప్యాంట్ షర్ట్ ఇవ్వకూడదు. కట్టుకునేందుకు పంచె పైన వేసుకునేందుకు ఉత్తరీయం ఇవ్వాలి. ఈ రకంగా చేస్తే ఫలితం ఏంటి అంటే….మనకొచ్చిన సంకటాలు పోతాయి. విజ్ఞేశ్వరుడు అంటే విజ్ఞాలు పొగొట్టేవాడు….కష్టాలు పొగొట్టే వ్యక్తి కాబట్టి….. ఏ ఇబ్బంది ఉన్నా, ఎలాంటి ఆటంకం ఉన్నా..మనం చేసే పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఉన్నా…సంకష్ట హర చతుర్ధి వ్రతం చేస్తే ఫలితం ఉంటుంది.