
ప్రతీ మనిషి సిరుల తల్లి కటాక్షం కోసం ఆరాటపడుతుంటారు. ఆ తల్లి చల్లని చూపు ఉంటే తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని కోరుకుంటుంటారు. అయితే మనం చేసే కొన్ని పనుల వల్ల ఆ లక్ష్మీ దేవి మన ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. ముఖ్యంగా ఇంటి గడపతో మహాలక్ష్మీ కృపకటాక్షలు ఆధారపడి ఉంటాయి. గడప అనేది శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం . అందుకే దీన్ని చాలా పరిశుభ్రంగా, అందంగా ఉంచుకోవాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి వీధి ముంగిట చక్కగా కల్లాపు చల్లి రతనాల ముగ్గులతో అలంకరించాలి. ఆ గడపకు కూడా పసుపు, కుంకుమ రాసి ముగ్గు గీతలు ఉండేలా చూసుకోవాలి. గడప పైబాగాన కూడా వేసిన తర్వాత గడపకు అటు వైపు ఇటు వైపు కూడా రెండు తెలుపు పుష్పలు ఏర్పాటు చేయాలి.
లక్ష్మీదేవి గడప ఉన్న గృహానికే ప్రవేశిస్తుంది. ఇటీవల కాలంలో మార్బల్స్కు అలవాటు పడి గడపలు లేకుండా చేస్తున్నారు. ఇంటి సింహ ద్వారానికి ఎట్టిపరిస్థితుల్లో గడప ఉండాలి. పడకున్న పడక గదికి కనీసం గడప అమర్చాలి. లక్ష్మీదేవి ఆ ఇంటి గడప దాటి లోపలికి వచ్చిన తర్వాత మళ్లీ ఎక్కడా గడప కనపడకపోవడంతో…తిరిగి వెనక్కి వెళ్లిపోతుంది. చాలా మంది పడక గదిలోనే బీరువా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ పడక గదికి గడప లేకపోవడంతో …..లక్ష్మీదేవి మీ దరికి చేరదు. కాబట్టి కనీసం మీ పడక గదికైనా గడప పెట్టుకోవాలి. సింహద్వారానికి గడప ఏర్పాటు చేసేప్పుడు…. కించిత్తు పెద్ద గడప ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇక గడపపై కొన్ని పనులు చేయకూడదు.

గడప మీద కూర్చొవడం కానీ , కాలు పె ట్టడం గానీ చేయకూడదు. ఇంటి యజమానికి లక్ష్మీ కటాక్షంపొందాలంటే…. బయటకు వెళ్లేప్పుడు మనహ్ పూర్వకంగా గడపకు నమస్కారం చేయాలి. అలాగే బయట నుంచి లోపలికి వచ్చేప్పుడు …….బయట కాళ్లు కడుక్కుని నమస్కారం చేసి లోపలికి వస్తే ఆ గృహంలో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. మనం దేవాలయాలను సందర్శించనప్పుడు కూడా …..తప్పనిసరిగా గడపకు నమస్కారం చేసిన తర్వాతే భగవంతుడికి నమస్కారం చేసేందుకు వెళ్లాలి. ఇక్కడ ఇల్లు కూడా దేవాలయమే. ఈ గడపకు ఇంత గొప్పలక్షణ ఉంది. గడపకు రెండు వైపులా గుమ్మాలుంటాయి. ఆ గుమ్మాలకు పసుపు, ఎరుపు రంగులను అలంకరించాలి. గడపపై భాగాన స్వస్థిక్, ఓంకారం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. సింహద్వారానికి రెండు తలుపులు ఉండాలి.
ఈ మధ్య కాలంలో సింగిల్ డోర్ వాడుతున్నారు. వాస్తుశాస్త్ర రీత్యా అంత సబభు కాదు. రెండు తలుపులు కూడా రెండు కళ్లు. రెండు కిటికీలు రెండు వైపులా ఉంటే….. అవి రెండు చెవులు. మన మానవ శరీరానికి…… గృహానికి అభినావ భావ సంబంధం ఉంది. ఇంటి గడప, సింహాద్వారాన్ని బట్టి….. ఆ ఇల్లు ఎంత అభివృద్ధి చెందుతుందో చెప్పగల సత్తా….. మనకు వాస్తుశాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. గడప మీద తుమ్మితే వెంటనే నీళ్లు చల్లాలి. ఎందుకంటే ఆ గడప నుంచి వచ్చే అద్వీతియ శక్తి పుంజాల ప్రభావం …ఈ వ్యక్తి తుమ్మినప్పుడు అనార్ధదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది . కాబట్టి వెంటనే నీళ్లను చల్లితే ఆ దోషం పోతుంది. అందుకే గడప మీద కూర్చొని దువ్వుకోవడం, గడప మీద కూర్చొని మాట్లాడుకోవడం చేయకూడదు. గృహంలోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి గడప నాంది వాక్యం పలుకుతుందని విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరవద్దు. కాబట్టి గడప విషయంలో ఈ జాగ్రత్తలన్నీ పాటించి లక్ష్మీదేవి కృపకు పాత్రులు అవ్వగలరనేది మా ఆకాంక్ష.