
మన ఇంట్లో కానీ లేదంటే ఏదైనా దైవక్షేత్రంలో కానీ దీపారాధన అనేది చాలా ముఖ్యం. దానికి శాస్త్రాల్లోనూ, పురాణాల్లోనూ చాలా ప్రాధాన్యత ఉంది. అయితే దీపారాధన చేసే విషయంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. సంప్రదాయాలను అనుసరించి దీపారాధన చేస్తుంటారు. కానీ ప్రతీ ఇంట్లోనూ దీపాన్ని పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఎక్కడైనా పెద్ద పెద్ద ఉత్సావాలు, కార్యక్రమాలు జరిగే చోట దీపప్రజ్వలన అనే దాన్ని నిర్వర్తిస్తుంటారు. దాన్ని లైటింగ్ ది ల్యాంప్ అంటుంటారు. ఇంత వరకు బాగానే ఉంది. కార్యక్రమంలో భాగంగా ముందుగా ఐదు ఆరో పెద్ద దీపపు సమ్మేలుపెట్టి వచ్చిన అతిధులతో వెలిగించమంటారు. వారికి ఒక కొవ్వొత్తి ఇచ్చి వెలిగించమని చెబుతుంటారు. కానీ ఇది చాలా తప్పు. అంతేకాదు…చాలా దోషభూయిష్టమైన పని.
కొవ్వొత్తి అనే పదంలోనే కొవ్వు ఉంటుంది. అలాంటిది శుభకార్యానికి పనికిరాని కొవ్వు మధ్య ఒక ఒత్తు పెట్టి చేసిన కొవ్వొత్తిని ఎలా తీసుకుంటారు….దానితో మిగిలిన దేవతల కోసం వెలిగించే దీపాలను వెలిగించడం అనేది సరైన పద్ధతి కాదు. తప్పనిసరిగా ఏకహారతి ఇవ్వాలి. దీన్నే పూర్వం ఇస్తుండేవారు. చాలా మంది హారతికి ఏక హారతిని ఉపయోగిస్తుండేవారు. అంటే కొంచెం నూనె మాత్రమే కలిగి ఉన్న దాంట్లో ఒక ఒత్తు వేసి ఉంటుంది. దాన్ని మాత్రమే వెలిగించి….. దానితో మిగతావాటిని వెలిగించేవారు. ఇంట్లో దేవుడి దగ్గర దీపమైనా అలానే వెలిగించేవారు. అంత పెద్ద దీపపు సమ్మేలు కొనేగలిగిన స్థోమత ఉండేవాళ్లు …ఇంత చిన్న ఏకహారతిని కొని దాంట్లో ఒక చిన్న ఒత్తు వేసి దాన్ని వెలిగించి…దానితో మిగిలిన దీపాలను వెలిగించడం శుభప్రదం. ఇవన్నీ చేయడం వీలు కాదు అని అనుకునేవాళ్లు కూడా ఉంటారు. అలా వీలు కాని సందర్భాలు కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించడం అనేది రెండో పక్షం. ప్రధమ పక్షం మాత్రం కానీ కాదు. కాబట్టి అగ్గిపుల్లతోనైనా వెలిగించవచ్చేమో కానీ…కొవ్వొత్తితో మాత్రం వెలిగించకూడదు.
లేదంటే కొందరు అగర్బత్తీలు వెలిగించి వాటితో దీపాలను వెలిగిస్తారు. ఇది రెండో పద్ధతి. నిజానికి శ్రేష్టకరమైనది ఏంటి అంటే…ఒక ఒత్తు వెలిగించి దానితో మిగతావాటిని వెలిగించడం అనేది చాలా మంచిది. దీనికి కారణం కూడా ఉందని పూర్వీకులు చెప్పారు. ఇప్పటిలాగా అప్పట్లో అగ్గిపెట్టలు, యంత్రాలు అందుబాటులో లేని కాలంలో…ఏం జరిగేది అంటే……పోయి దగ్గరకు వెళ్లి దీపం వెలిగించాలన్నప్పుడు ఒక ఒత్తు వెలిగించి దానితో మిగిలినవాటికి వెలిగించేవారు. అంతేగానీ కొవ్వొత్తులను పూజల దగ్గరకు కానీ, దీపారాధన వద్దకు ఎట్టిపరిస్థితుల్లో పనికిరావు. వందల ఏళ్లుగా దీప ప్రజ్వలన అనేది ఒక సంప్రదాయంగా ఉంది. అక్కడ కొవ్వుత్తులతో దీపాలను వెలిగిస్తుంటారు. అది పద్ధతిని కచ్చితంగా మానేయాలి. అలా కొవ్వొత్తితో కాకుండా ఒత్తితో దీపపు సమ్మేలను వెలిగిస్తే….. సభకు వచ్చిన ప్రేక్షకులు దీపాన్ని వెలిగించడం ఇలానా అని తెలుసకుంటారు. ఇది కూడా ఒకరకమైన విద్యాబోధన అవుతుంది. వీలైనంత వరకు మరొక ఒత్తితో వెలిగిద్దాం. అది కుదరని పక్షంలో అగ్గిపుల్లతో వెలిగించుకుందాం. అంతేకాని…కొవ్వొత్తిని మాత్రం దగ్గర చేరనీయొద్దు.