
మనలో చాలా మంది ఉపవాసాలు ఉంటుంటారు. కానీ కొందరు వాటి గురించి తెలియకుండానే పాటిస్తుంటారు. అది సరికాదు. మనం ఏ పని అయితే చేస్తున్నామో దాని అర్ధం పరమార్ధం కచ్చితంగా తెలిసి ఉండాలి. ఉప వాసం. ఉప అంటే పక్కన. వాసం అంటే నివాసం. ఉప వాసము అంటే పక్కనే నివసించడం. అంటే దేవతల పక్కనే అని అర్ధం. మన ఏ దేవుడి కోసం అయితే ఉపవాసం చేస్తామో ఆ రోజుంతా కూడా ఆ దేవుడికి దగ్గరగా నివసించడం కోసం ఉపవాసం చేస్తుంటాం. కడుపు నిండితే సహజంగా నిద్ర వస్తుంది. కాబట్టి అలా నిద్ర రాకుండా ఉండాలంటే మనం తినకూడదు. అలా ఉపవాసాన్ని పాటిస్తుంటాం. ఉపవాసం ద్వారా భగవంతుడికి మన దగ్గరగా ఉండటం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం మనకు కలగడం..అదే విధంగా మనకు భాగవంతుడి పట్ల ఆరాధన భావన కలగడం జరుగుతుంది.
ఉపవాసం అంటే చాలా మంది కఠిక ఉపవాసం అనుకుంటారు. అసలు శాస్త్రాల్లో కఠిక ఉపవాసం అనేది లేదు. శాస్త్రాల్లో మొత్తం మూడు నిషేధాలు చెప్పారు. అందులో ఒకటి నిరాహారదీక్ష. చాలా మంది నేను నీరాహారదీక్ష చేస్తాను అని చెబుతుంటారు. అది మహాపాపం. నిరాహారదీక్ష చేయడాన్ని శాస్త్రంలో మహాదోషంగా పరిగణిస్తారు. రెండోది ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం. ఇది మరో మహా దోషం. శాస్త్రల్లో ఆత్మహత్యకు ఇచ్చినంత దోషం మరొక దానికి లేదు. మూడోది నేను కఠిక ఉపవాసం చేస్తాను అని చెప్పడం. ఉపవాసం చేస్తే మంచిది….అలా అని కఠిక ఉపవాసం చేస్తే పాపం. కఠిక ఉపవాసం చేస్తే చెడుజరుగుతుంది. ఉపవాసం అంటే ఫలాలు, పండ్లు, పాలు తాగవచ్చు. కానీ కఠిక ఉపవాసం చేయకూడదు. కొందరు ఉపవాసం ఉన్న వ్యక్తులు…..ఆలయానికి వెళ్లినప్పుడు తీర్ధప్రసాదాలు ఇస్తుంటే మాకు వద్దు ఉపవాసం ఉన్నామని చెబుతుంటారు.
అలా చెప్పడం మహాపాపం, దోషం. దేవాలయంకు వెళ్లినప్పుడు కచ్చితంగా తీర్ధప్రసాదాలు తీసుకోవాలి. ఇంకొందరు ఏమంటారంటే మామూలు ప్రసాదమైతే తినేవాళ్లమండి…అక్కడ పులిహోర పెడుతున్నారు …అది తింటే అన్నం తిన్న ఫీలింగ్ వస్తుంది కదా మేం తినలేము అని చెబుతుంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. పులిహోరాను కచ్చితంగా ప్రసాదంగా తీసుకోవాలి. పులిహోరాలో పసుపు కలిపి ఉంటుంది…..దేవతకు నైవేద్యం పెట్టింది కాబట్టి కచ్చితంగా తీసుకోవాలి. కొందరు ప్రసాదాన్ని తీసుకుని తిన కుండా పక్కన పెట్టేస్తుంటారు. మరికొందరు కింద పడేస్తుంటారు. ఇది మహాపాపం. ఉపవాసం అంటే దేవుడి దగ్గరకు నివాసించడం…. అలాంటి దేవుడి దేవాలయనికి వెళ్లినప్పుడు కూడా ఆయన ప్రసాదం తీసుకోకపోతే ఉపవాస ఫలితం ఏముంటుంది.
కాబట్టి ఉపవాసం ఉండేవాళ్లు నిరభ్యంతరంగా ప్రసాదాలు తీసుకోవాలి. ఇంకొందరు ….అతి తెలివితేటలతో ఏం చేస్తుంటారంటే….ప్రసాదమే కదా బాగా తినేస్తుంటారు. ఒకసారి పెట్టించుకుని రెండో సారి కూడా తీసుకుంటారు. ఫలహారాన్ని ప్రసాదంలా తీసుకోవాలి కానీ భోజనంలా చేసుకోకూడదు. నిజానికి దేవాలయాల్లో అసలు ఫలితం అంతా ప్రసాదంలోనే ఉంటుంది. కాబట్టి ప్రసాదాన్ని తీసుకోవాలి. అలా అని భోజనంలా తీసుకోకూడదు.