మహమ్మారిని మించిన కష్టాలు రాబోతున్నాయా? బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమి ఉందో చూడండి!

కరోనాతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దేశాల ఆర్ధిక స్థితిగతులు మారిపోతున్నాయి. సెకండ్ వేవ్ లో రోజుకి లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో మానవాళి చూసిన అతిపెద్ద కష్టం ఇదే అని అనుకుంటున్నారు అంతా. ఇకపై ఈ మహమ్మారిని మించిన ఉపద్రవం ఉండబోదు అనుకుంటున్నారు. కానీ.., ఈ అంచనాలు అన్నీ తప్పేనా? రాబోయే కాలంలో మావాళికి దీనికి మించిని ముప్పులు తప్పవా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి పెద్ద లాజిక్స్ కూడా అవసరం లేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానంపై కాస్త అవగహన ఉంటే చాలు. మన దేశంలో బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని అందరూ నమ్ముతారు. ఎందుకంటే ఇప్పటి వరకు అందులో చెప్పినవి అక్షరం పొల్లు పోకుండా జరిగాయి. జరుగుతున్నాయి. కానీ.., ఒకవేళ భవిష్యత్ ల కూడా కాలజ్ఞానంలో ఉన్నట్టే జరిగితే మానవ మనుగడే ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం ఉంది. కరోనా రాకని కూడా బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు. ఆయన చెప్పినట్టే ఈ వైరస్ ఇప్పుడు మానవ జీవితాలని అస్తవ్యస్తం చేస్తోంది. కానీ.., కాలజ్ఞానం ప్రకారం చూసుకుంటే రాబోయే కష్టాలు ఇంకా దారుణంగా ఉండేలా అనిపిస్తున్నాయి. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రాబోయే విపత్తులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సముద్రంలో ఉత్పాతాలు పుడతాయి. మంచు శిఖరాలు కరిగి దేశాలకి దేశాలే మునిగిపోతాయి. ప్రస్తుతం దేశంలో మంచు శిఖరాలు ఇలానే కరుగుతున్నాయి. గత 15 సంవత్సరాలుగా సముద్ర మట్టాలు స్థాయి పెరుగుతూ పోతోంది. సో ఈ విపత్తు మానవాళికి తప్పకపోవచ్చు. ఇక దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ఆ వాయువు పీల్చి వేల మంది చనిపోతారు. లక్షల మంది జీవితాలు నాశనం అవుతాయని కాలజ్ఞానంలో ఉంది. ఇంతటి పొగ మంచు అంటే.. అది ఒక్క అణుబాంబు వల్లే సాధ్యం. పేలిన తరువాత ఆ వాయువు పీల్చితేనే ఇంతటి అనర్ధం సాధ్యం అవుతుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల నడుమ ఏర్పడుతున్న యుద్ధాలను చూస్తుంటే.. భవిష్యత్ లో అణుబాంబుల వినియోగం తప్పదని అర్ధం అవుతోంది. ఇక కాలజ్ఞానంలో ఉన్న మరో అంశం.. పట్ట పగలే నక్షత్రాల వాన కురవడం. అంటే విశ్వంలో సంభవించే ఓ విపత్తు కారణంగా.. గ్రహశకలాలు, తోక చుక్కలు భూమిపై వేల సంఖ్యలో వచ్చి పడే ప్రమాదం ఉంది అనమాట. విశ్వంలో ఇలాంటి దారుణమే సంభవిస్తే భౌగోళికంగా భూమి కూడా కదలడం ఖాయం. తద్వారా ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి ఊహించడం కూడా కష్టమే.

bramham 1 1

ఇక మూడో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి 7 ఊర్లకి ఒక్క ఊరు మాత్రమే మిగులుతుంది. ఒక్కసారిగా 144 నగరాలను జల ప్రవాహం ముంచెత్తుతుంది. ఇంతటి వరద.. వర్షం వల్ల వచ్చేది కాదు. సో… ఇది సునామి సూచనా అనుకోవచ్చు. నిజంగా ఇంతటి సునామి గనుక వస్తే.. ప్రపంచపటంలో కొన్ని దేశాలు లేకుండా పోతాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 12 రోజుల పాటు.. కృష్ణ, గోదావరిలో చుక్క నీరు ఉండదు అని కాలజ్ఞానంలో చెప్పబడి ఉంది. అంటే.. ఇది ఎంతటి తీవ్రమైన కరువు అన్నది అర్ధం చేసుకోవచ్చు. ఈ దెబ్బకి ఎంత మంది చనిపోతారో ఊహించుకోవచ్చు. దేవతా మూర్తులు మనుషులతో మాట్లాడుతారు. నవ యాగంటి క్షేత్రాలలో ఊహించని సంపద బయట పడుతుంది. దేశ రాజధానిలో వాయు సమస్య వచ్చి.. అక్కడ ప్రజలు జీవించడమే కష్టం అవుతుంది. ప్రస్తుతం ఢీల్లీలో ఇలాంటి పరిస్థితిలే ఉన్నాయి. ఇక కొండలు పేలి, నిప్పుల వాన కురుస్తుంది. ఇలాంటి ఎన్నో విపత్తులు తప్పవని బ్రహ్మం గారి కాల జ్ఞానంలో చెప్పబడి ఉంది.