Home భక్తి శనివారం రాత్రి ఇలా చేయండి! ఆదివారం ఉదయం నుంచీ విజయాలు మీ వెంటే!

శనివారం రాత్రి ఇలా చేయండి! ఆదివారం ఉదయం నుంచీ విజయాలు మీ వెంటే!

bhakti tips

మనకు ఎన్నో మంత్రాలున్నాయి. అలాగే, ఎన్నెన్నో యంత్రాలు కూడా వున్నాయి. అయితే, మంత్రం, యంత్రమే కాదు తంత్రం కూడా వుంది! తంత్రం అంటే చిన్న చిన్న చిట్కాలతో గ్రహ బాదల్ని తొలగించుకోవటం. ఇవి చేసేటప్పుడు శ్రద్ధా, విశ్వాసం చాలా ముఖ్యం. అవి వుంటే ఎంతో శుభ ఫలితాల్ని ఇస్తాయి పెద్దలు చెప్పిన ఈ తంత్రాలు. ఇక చాలా మందికి తమ జీవితంలో ఎదురయ్యే సమస్య బద్ధకం, అనాసక్తి. ఏదైనా పని చేయాలంటే ముందు బద్ధకం వుండకూడదు. ఉత్సాహంగా పని మొదలు పెడితే ఫలితం దానంతటదే అదే వస్తుంది. కానీ, చాలా మంది బద్ధకంతోనో, నిరాసక్తతతోనో పనే ప్రారరంభించకుండా వుండిపోతుంటారు. ఇక కొందరైతే తప్పక లాభం చేకూరుతుందని తెలిసి కూడా పని చేయటానికి ముందుకు వెళ్లరు. కారణం మనస్సులో పని చేయాలన్న బుద్ది పుట్టుకపోవటమే! మరి ఈ లోపానికి పరిష్కారం ఏంటి?

శనివారానికి ముందు రోజున… అంటే, శుక్రవారం నాడే మట్టి ప్రమిద, ఒక లవంగం, కాస్తంత నువ్వుల నూనే సమకూర్చుకోండి. శనివారం నాడు రాత్రి ఏడు దాటిన తరువాత పూజ గదిలోకి ప్రవేశించండి. ఉత్తర దిక్కుగా ముఖం చేసి కూర్చుని మీ ఇష్టం దైవం ముందు మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. ప్రత్యేకంగా ఈ దీపం వెలిగించటానికి కొనుక్కుని వచ్చిన కొద్దిపాటి నువ్వుల నూనే పూర్తిగా పోసేసి రెండు వత్తులతో వెలిగించండి. మళ్లీ ఈ నువ్వుల నూనే వేరే సందర్బంలో వాడకూడదు. శనివారం రాత్రి వెలిగించే నువ్వుల నూనె దీపం ఉత్తర దిక్కుగానే వుండాలి. వత్తులు ఉత్తారాన్ని చూసేలా ఏర్పాటు చేసి దీపం వెలిగించాలి. ఏదైనా తీపి పదార్థం కాస్తంత నివేదన చేయాలి. ఇక దీపం ముందు లవంగాన్ని వుంచి “ఓం శనైశ్చరాయ నమః” అంట నూటా ఎనిమిది సార్లు జపించాలి. ఇక ఆ తరువాత దీపం ముందుంచిన లవంగాన్ని తీసుకుని ఇంటి బయటకు వెళ్లాలి.

దక్షిణ దిక్కుని చూస్తూ చేతిలో లవంగాన్ని ఉంచుకుని… బద్ధకం,తమోగుణం పోవాలనీ, ఉత్సాహం కలగాలనీ ప్రార్థించాలి. ప్రతి పనిలోనూ విజయం చూకూరాలని దేవుడ్ని కోరుకుని… లవంగం దక్షిణ దిక్కుకి విసిరి వేయాలి. అలా చేస్తున్నప్పుడు కళ్లు మూసుకుని వుండాలి. తరువాత కళ్లు తెరవకుండా వెనుదిరిగి అప్పుడు కళ్లు తెరిచి వెనక్కి చూడకుండా వెళ్లిపోవాలి. శనివారం రాత్రి ఇలా పరిహారం చేసుకున్నాక తల స్నానం చేసి పడుకోవాలి. దీని వల్ల మరుసటి ఉదయం నుంచి మనస్సు ఉత్సాహంగా, ఆహ్లాదంగా వుంటుంది. చేసే పనుల్లో విజయం మరింత తేలిగ్గా లభిస్తుంది!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad