ఈ మధ్యకాలంలోని అమ్మాయిలు చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువులో రాణించలేకపోతున్నానని, ప్రియుడు మోసం చేశాడని, ఆర్థిక సమస్యలు అంటూ ఇలా ఎన్నో కారణాలతో క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడడం విన్నాం. కానీ కర్ణాటకలోని మాత్రం జట్టు రాలిపోతుందని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మైసూరుకు చెందిన కావ్యశ్రీ (22) అనే యువతి నగరంలో BSC ఫార్మసీ చదువుతోంది. అయితే గత కొంత కాలం నుంచి ఆ యువతిని హెయిర్ ఫాల్ సమస్య తీవ్రంగా వేధించింది. కొన్నాళ్లు కామన్ గా భావించిన ఆ యువతి రాను రాను జట్టు విపరీతంగా ఉడిపోవడం మొదలైంది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుని డాక్టర్లను సంప్రదించి మెడిసిన్ వాడింది. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆ యువతి జట్టు మొత్తం ఊడిపోయింది. దీంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇది కూడా చదవండి: Mysuru: ఇంటిపక్క మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన తండ్రీకొడుకులు! ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసింది. వెంటనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న కావ్యశ్రీ కుటుంభికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. జట్టు ఊడిపోతుందని ఆత్మహత్యకు పాల్పడ్డ కావ్యశ్రీ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.