రోడ్డు ప్రమాదం ప్రముఖ నటి చిన్నారి కూతుర్ని బలితీసుకుంది. బెంగుళూరుకు చెందిన ప్రముఖ టీవీ నటి అమృతా నాయుడు, తన ఆరేళ్ల చిన్నారి స్కూటిపై వెళ్తుండగా, ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నటి కూతురు సమన్వి అక్కడికక్కడే మృతి చెందగా, నటి అమృతాకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గాయాలైన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే ఆమె నాలుగు నెలల గర్భవతి కూడా. ప్రస్తుతం నటి ఐసీయూలో చికిత్స పొందుతోంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన కూతురు సమన్వి పలు రియాల్టీ షోలలో మంచి పేరు తెచ్చుకుంది. విషయం తెలుసుకున్న కన్నడ సినీ కళాకారులు విచారణం వ్యక్తం చేశారు.