ప్రదీప్ ఇంట నెలకొన్న విషాదం

బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యాంకర్, నటుడు ప్రదీప్ తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చురకైన పంచులతో ఆకట్టుకునే ఆయన ఇటీవల ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించాడు. క‌రోనా వేల టాలీవుడ్ లో రోజుకో విషాదం నెల‌కొంటుంది. తాజాగా ప్ర‌ముఖ యాంకర్ ప్ర‌దీప్ ఇంట తీవ్ర‌విషాదం నెల‌కొంది. ప్ర‌దీప్ తండ్రి పాండురంగ ఈ రోజు క‌న్నుమూశారు. ఆయ‌న కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది.

అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈరోజు ఆయ‌న క‌న్నుమూశారు. మ‌రోవైపు ప్ర‌దీప్ కు క‌రోనా వ‌చ్చింద‌ని కొన్నిరోజులుగా వార్తులు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కొద్దిరోజులుగా ప్ర‌దీప్ ఈటీవీ ఢీ, జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో ల‌కు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ విష‌యంపై ప్ర‌దీప్ ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు.

అయితే ఆయన కరోనా కారణంగా మరణించారనే వార్తలు వస్తున్నప్పటికీ దానిపై అధికారిక సమాచారం లేదు. ప్రదీప్ ఇంట నెలకొన్న ఈ విషాదంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్ర‌దీప్ తండ్రి క‌రోనాతో మ‌ర‌ణించారా లేదంటే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగానే మ‌రణించారా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇంత‌కాలం బుల్లి తెర‌పై రాణించి ఇప్పుడు వెండితెర‌పై కూడా మెరుస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో తండ్రిని కోల్పోవ‌డం బాధాక‌రం.