7 డేస్.. 6 నైట్స్’ …14 ఏళ్ళు ???

ఎంఎస్ రాజు అంటే ఒకప్పుడు ప్రేమ కథా సినిమాలకు బ్రాండ్. మనసంతా నువ్వే, వర్షం, నీ స్నేహం, నువ్వోస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, ఆట, వాన ఇలా ఆయన నిర్మించిన సినిమాలు ప్రేమికులను రిపీటెడ్ గా థియేటర్స్ కు రప్పించేవి. శత్రువు, దేవి, దేవి పుత్రుడు, ఒక్కడు లాంటి మాస్ ఎలివేటెడ్ సినిమాల నుండి గ్రాఫికల్ సినిమాలను కూడా ఆయన నిర్మించారు. ఇప్పుడు ‘7 డేస్.. 6 నైట్స్’ అనే మరో సినిమా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

డర్టీ హరి సినిమా సమయంలో ఎంఎస్ రాజు ఈ కాలానికి తగ్గట్లుగా నాడి పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని అర్ధమైంది. కాగా ఇప్పుడు తన తర్వాత సినిమా ‘7 డేస్.. 6 నైట్స్’ సినిమాకు మొత్తం యువతనే తీసుకుంటున్నాడట. ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ నుండి మిగతా టెక్నీషియన్స్ వరకు అందరినీ 22 ఏళ్ల లోపు వారినే ఎంచుకున్నాడట. ఇక సంగీత దర్శకుడైతే కేవలం 14 ఏళ్ల బాలుడే కావడం మరో విశేషం.సమర్థ్ గొల్లపుడి అనే అతి చిన్న వయసుగల సంగీత దర్శకుడు ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడట.

సమర్థ్ ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమే. అతని సంగీతానికి ఇప్పటికే ఫ్యాన్స్ కూడా ఉండగా ఇప్పుడు ఏకంగా సినిమాకు సంగీత దర్శకుడిగా రాబోతున్నాడు. మొత్తంగా తన సినిమాను అంతా యువతతోనే తెరకెక్కిస్తున్నాడు రాజు. ముందుగా టైటిల్ ‘7 డేస్.. 6 నైట్స్’ అని ప్రకటించి ఆసక్తి పెంచిన ఎంఎస్ రాజు.. ఇప్పుడు అందరినీ యువతనే తీసుకొని మరింత క్యూరియాసిటీ పెంచాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో.. అసలు కథ ఏంటో కొద్దిరోజులు ఆగితే కాని తెలియదు. సమర్థ్ గొల్లపుడిని వరుసగా మూడు చిత్రాలకు సైన్ అప్ చేయించారట. అంటే.. అతడిలో విషయం ఎంత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంతేకాకుండా.. ఈ చిత్రంలో నటించే వారితోపాటు టెక్నీషియన్స్ కూడా 22 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు గలవారేనని తెలుస్తోంది. ఇలా.. ఎన్నో విధాలుగా ఆసక్తిని రేకెత్తిస్తోంది ‘‘7 డేస్.. 6 నైట్స్’’. మరి ఈ చిత్రం ఎలాంటి సంచలనాన్ని నమోదు చేస్తుందో చూడాలి. హీరోగా పలు చిత్రాల్లో ఆకట్టుకున్న అశ్విన్.. నిర్మాతగానూ మారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ఎంఎస్ రాజు బ్యానర్ ను పునఃప్రారంభించాలని అశ్విన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.