ఐకాన్ స్టార్ 21f…ఎవరితో?ఎప్పుడూ??

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఢిపరెంట్ డైరెక్టర్  సుకుమార్ హాట్రిక్ కలయికలో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా గతేడాది ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు.  అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

బన్నీ కెరీర్‌‌లో 20వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. మునుపెన్నడూ చూడని మాస్ గెటప్‌లో ఆయన్ను చూపించబోతున్నారు సుక్కు. ఈ మూవీలో బన్నీతో కలిసి స్టెప్పులేస్తోంది రష్మిక మందన. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ కావడంతో బన్నీ తర్వాతి ప్రాజెక్టు ఎవరితో అనే దానిపై అందరి చూపు పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది.

‘పుష్ప’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమాను కన్ఫర్మ్ చేశారు. అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఎన్నటికీ గుర్తుండిపోయేలా ఆయన కోసం కొరటాల ప్రత్యేకంగా బలమైన కథ రెడీ చేశారని టాక్ నడిచింది. ఇంతలో ఆ ప్రాజెక్టు విషయంలో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ‘ఆచార్య’ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు కొరటాల శివ. ఈ మేరకు ఇటీవలే అఫీషియల్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. దీంతో మరి అల్లు అర్జున్ 21వ సినిమా సంగతేంటి? అది ఎవరితో ఉండబోతోంది? అనే అనుమానాలు మొదలయ్యాయి. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఢిపరెంట్ డైరెక్టర్  సుకుమార్ హాట్రిక్ కలయికలో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.  నిజానికి బన్నీ 21 కోసం ప్రశాంత్ నీల్ సహా చాలామంది దర్శకులు పోటీపడ్డారు కానీ ఆ అవకాశం మురుగదాస్‌‌కే దక్కిందని అంటున్నారు. దీనిపై అతిత్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.